ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులివెందులలో వైసీపీ శ్రైణులు వికృత చేష్టలకు దిగొద్దు- బీటెక్ రవి - BTech Ravi Warning to YSRCP Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 10:30 PM IST

ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్లను ఏదైనా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి: బీటెక్ రవి (ETV BHARAT)

Pulivendula TDP Candidate BTech Ravi Warning to YSRCP Leaders: జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఏజెంట్లకు వైసీపీ నేతల నుంచి ఏదైనా జరిగితే దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వైఎస్సార్ జిల్లా పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హెచ్చరించారు. తాము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పద్ధతిలో శాంతియుతంగా ఎవరి ఓటు వారు వినియోగించుకునేలా ఓటింగ్ జరిగేలా చూస్తున్నామని అన్నారు. వైసీపీ శ్రైణులు పోలింగ్ బూతుల వద్ద ఎవరైనా వికృత చేష్టలు గాని మాటలు గాని మాట్లాడితే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని బీటెక్ రవి అన్నారు. నియోజకవర్గంలోని శ్రీ రామ్ నగర్ గుట్ట ప్రాంత వాసులు బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారని తెలిపారు. ఇప్పటికే పార్టీలో చేరడానికి చాలా సమయం వృధా చేశామని అన్నట్లు రవి తెలిపారు. ఇప్పటికైనా పులివెందులలో బీటెక్ రవి, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details