ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాఠశాల మైదానంలో​ నిర్మాణాలు- క్రీడాకారులు, అఖిలపక్షం ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 7:13 PM IST

Political_Parties_Agitate_for_School_Ground_in_Tirupati

Political Parties Agitate for School Ground in Tirupati : తిరుపతి ఎస్వీ ఉన్నత పాఠశాల మైదానంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, క్రీడాకారులు, పూర్వవిద్యార్ధులు నిరసనకు దిగారు. ఎస్వీ పాఠశాల మైదానంలో టీటీడీ(TTD) శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. దాదాపుగా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్వీ ఉన్నత పాఠశాల మైదానాన్ని టీటీడీ ఇతర అవసరాలకు వినియోగిస్తూ విద్యార్ధులకు ఆడుకోవడానికి మైదానం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. పాఠశాల మైదానం ముందు భవన నిర్మాణాలు వద్దు క్రీడలే ముద్దు, ఎస్వీ పాఠశాల మైదానం కాపాడుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

జాతీయ, అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారులను అందించిన ఎస్వీ పాఠశాల మైదానాన్ని క్రీడాకారులకు దూరం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే ఆధ్వర్యంలో ఎన్నో ఖాళీ స్ధలాలు ఉన్నా భవన నిర్మాణాలు అక్కడ చేయకుండా పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. వెంటనే భవన నిర్మాణాలు ఆపివేసి క్రీడాకారులకు మైదానాన్ని అందుబాటులోకి తీసుకరావాలని కోరారు. లేనిపక్షంలో తి.తి.దే పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details