ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ అభ్యర్థిపై కవ్వింపు చర్యలు- వైసీపీ కార్యకర్తలపై లాఠీ ఝుళిపించిన పోలీసులు - Police Lathi Charge in Proddutur

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 9:55 PM IST

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం - వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ (ETV Bharat)

Police Lathi Charge on YCP leaders Was Polling Center in Proddutur : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైదుకూరు రోడ్డులోని కసెట్టి పాఠశాల సమీపంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి అభ్యంతరం తెలపడంతో ఎమ్మెల్యే రాచమల్లును పోలింగ్ కేంద్రం నుంచి బైటకు పంపారు. 

అదే సమయంలోనే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వరదరాజుల రెడ్డిని కూడా వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో తన వాహనాల్లో వెళ్తున్న వరదరాజుల రెడ్డిపై పాండురంగ స్వామి ఆలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. తొడలు కొడుతూ మీసాలు మేలేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. అయినా వినకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details