ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం వస్తే షాపులు మూసేస్తారా ? - పోలీసులతో దుకాణాదారుల వాగ్వాదం - jagan tour at prakasam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 2:23 PM IST

People_Facing_Problems_Due_to_CM_Meeting_at_Tangutur

People Facing Problems Due to CM Meeting at Tangutur: సీఎం జగన్మోహన్ రెడ్డి సభలు అంటే సామాన్య ప్రజలకు తీవ్ర కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా టంగుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. సభ సెంటర్లో ఏర్పాటు చేయటంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Shops Closed of CM Tour in Prakasam District: చుట్టుపక్కల నుంచి వాహనాలు సభా ప్రాంగణంలోకి రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. పోలీసులు ప్రజలు, వాహనాలకు అనుమతి నిరాకరించటంతో పొలాల్లో దిగి అడ్డంగా నడుచుకుంటా ఊర్లోకి వస్తున్నారు. టంగుటూరి సెంటర్లో సభ ఏర్పాటుతో చుట్టుపక్కల షాపులు మొత్తం రాత్రి నుంచి మూసేశారు. దీంతో షాప్ యజమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సీఎం వస్తే మా షాపులు ఎందుకు మూసేస్తారు అని షాపు యజమానులు ప్రశ్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details