ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘనే' - Pensioners Party Complaint To EC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:11 PM IST

pensioners_party_complaint_to_ec

Pensioners Party Complaint To EC : ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పెన్షనర్ల పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. సలహాదారు హోదాలో ప్రభుత్వ వేతనాన్ని పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ విమర్శలకు సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘనేనని అన్నారు. తక్షణమే చంద్రశేఖర్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు పెన్షనర్ల పార్టీ వినతిపత్రం ఇచ్చింది. 
 

Andhra Pensioners Party Complaint To EC on Employee Welfare Adviser : ఎన్నికల కోడ్​ అమలు అయ్యాక కూడా రాజకీయ ప్రచారాలు చెయ్యడమేంటని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఓటు వెయ్యాలని ఉద్యోగులను ప్రలోభపెట్టేలా ప్రవర్తించారని పెన్షనర్ల పార్టీ మండిపడింది. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నాడే తప్ప చంద్రశేఖర్​ రెడ్డి ఉద్యోగుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం పై  సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details