ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికార పార్టీ నిర్లక్ష్యం కారణం వల్లే తాగునీటి సమస్య- ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ - PAYYAVULA ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 11:35 AM IST

Payyaula On Uravakonda Water Crisis: తాగునీటి సమస్యపై పదే పదే ప్రశ్నిస్తున్నా అధికార యంత్రాంగం సరైన సమధానం చెప్పలేదని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పలు కాలనీల్లో పయ్యావుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాగునీటి సమస్యను (Water Problem) పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైయ్యిందని ఆరోపించారు. రోజు విడిచి రోజు రావాల్సిన నీరు 12 రోజులకోసారి వస్తుండటానికి గల కారణాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Payyavula Election Campaign: నీటి సమస్యకు ప్రధాన కారణం అధికార పార్టీ నేతల అలసత్వం, నిర్లక్ష్యమే కావడంతో నోరు విప్పడానికి జంకుతున్నారని పయ్యావుల విమర్శించారు. వారు మౌనం వీడి సమాధానం చెప్పడానికి వస్తే నిర్లక్ష్యం బయటపడుతుందనే మౌనంగా ఉన్నారని తెలిపారు.  టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కూటమికి (Alliance) ఓటు వేయాలని అభ్యర్థించారు.  

ABOUT THE AUTHOR

...view details