ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటేసే ముందు బిడ్డల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచించుకోవాలి: ఎన్​ఆర్​ఐ పారిశ్రామికవేత్త రావి రాథాకృష్ణ - NRI Radha Krishna Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 12:53 PM IST

Updated : May 4, 2024, 1:12 PM IST

ఓటేసే ముందు బిడ్డల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచించుకోవాలి: ఎన్​ఆర్​ఐ పారిశ్రామికవేత్త రావి రాథాకృష్ణ (ETV BHARAT)

NRI Radha Krishna Interview on Elections : ఓటేసే ముందు తమ బిడ్డల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాసాంధ్రుడు రావి రాధాకృష్ణ సూచించారు. సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో సంస్థతో కలిసి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురానికి చెందినవారు.

20 ఏళ్ల కిందట విదేశాలకు వెళ్లారు. తొలుత అమెరికాలో, తర్వాత సౌదీ అరేబియాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. యువత ఆలోచనతో ఓటు వేసి సమర్థవంతమైన నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ది లక్ష్యంగా ఓటు వెయ్యాలని అన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ది తప్పనిసరి దీనికోసం ప్రభుత్వం తప్పనిసరిగా చేయూతనందించాలన్నారు. కంపెనీలు ఏర్పరిచి ప్రభుత్వమే స్వయం ఉపాధి అవకాశాలందించాలని తెలిపారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఓటు హక్కు వినియోగించునేందుకు స్వస్థలానికి వస్తున్న రావి రాధాకృష్ణతో ‘ఈటీవీ-ఈనాడు' ప్రత్యేక ముఖాముఖి.

Last Updated : May 4, 2024, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details