ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం​ సభలో వెనుదిరిగిన జనం - తలలు పట్టుకున్న వైసీపీ నేతలు - People Leaving While CM Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 5:45 PM IST

సీఎం​ సభలో వెనుదిరిగిన జనం - తలలు పట్టుకున్న వైసీపీ నేతలు (Etv Bharat)

No People For CM Jagan Election Meeting in Narsapuram: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ సభకు జన స్పందన కరవైంది. జగన్ మాట్లాడుతుండగానే సభకు తీసుకొచ్చిన జనం వెనుదిరిగారు. సభ ప్రాంగణం ఖాళీ అయిపోవడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. సభకు ఇతర ప్రాంతాల నుంచి జనసమీకరణ చేశారు. ఒక్కొక్కరికి 200 నుంచి 300 రూపాయల వరకు చెల్లించినట్లు అక్కడికి వచ్చిన జనం చర్చించుకుంటున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జగన్‌ మాట్లాడుతుండగానే ఆ ప్రాంతమంతా ఖాళీ అయిపోయింది. 

సీఎం జగన్​ సభ ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు కష్టాలు తప్పట్లేదు. సీఎం జగన్ పర్యటన అంటే ఆ ప్రాంతం మొత్తం పచ్చదనమే లేకుండా చేసి ఎడారిగా మార్చిన అనంతరమే ప్రారంభమవుతుంది. ఆయన పర్యటన అంటే చాలు రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టేయడం, ట్రాఫిక్​ ఆంక్షలతో ప్రజలకు కష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతోంది. సీఎం వస్తున్నారంటే చాలు ఆ ప్రాంతంలో ముందునుంచే వాహనాల దారి మళ్లింపు ప్రక్రియ జరుగుతుంది. పచ్చదనానికి తూట్లు పొడవటం జగన్​ పర్యటనలోనే చూస్తున్నామని ప్రజలు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details