ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి- రాష్ట్ర ప్రజానీకానికి లోకేశ్ అభినందనలు - LOKESH APPRECIATION TO VOTERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:16 PM IST

రాష్ట్ర ప్రజానీకానికి నారా లోకేశ్ అభినందనలు - ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని వెల్లడి (ETV Bharat)

Nara Lokesh Appreciation to AP Voters : రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన కుటిల ప్రయత్నాలను తిప్పికొడుతూ ఓట్లతో తిరుగుబాటు చేసిన రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనమన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఏపీ ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుందని కొనియాడారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ లోకేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా మంగళగిరి చైతన్యానికి మారుపేరని మరోసారి నిరూపితమైందని లోకేశ్ కొనియడారు. తెల్లవారకముందే నియోజకవర్గ ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓపిగ్గా పోలింగ్ బూతుల్లో వేచిఉండటం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి ప్రతీక అని తేల్చిచెప్పారు. పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న మంగళగిరి కుటుంబసభ్యులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details