ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీచపు రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: నందమూరి రామకృష్ణ - Nandamuri Ramakrishna campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 2:44 PM IST

Nandamuri Ramakrishna Participated Election Campaign in Krishna District : కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో స్వర్గీయ ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోడె ప్రసాద్‌కు మద్దతుగా ఆయనతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో రామకృష్ణ పాల్గొనటం తనకెంతో ఆనందంగా ఉందని బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు

రాష్ట్రం అభివృద్ధి చెందలంటే చంద్రబాబును గెలిపించాలని నందమూరి రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఒక తెల్ల కాగితం తప్పించి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతలు రెచ్చగొట్టే రాజకీయాలు, విద్వేషపు అల్లర్లు సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. నీచపు రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్​ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీ గెలించాలని ఓటర్లను కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details