ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వై​సీపీ కౌన్సిలర్​ వేధిస్తున్నారని అటెండర్​ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 5:20 PM IST

municipal_office_attender_suicide_attempt

Municipal Office Attender Suicide Attempt: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న కృష్ణ అనే వ్యక్తి, తాను పనిచేస్తున్న కార్యాలయ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వైఎస్సార్​సీపీ కౌన్సిలర్​ వేధింపులు, కుటుంబ సమస్యల కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని సదరు వ్యక్తి ఓ వీడియోను రికార్డు చేశాడు. బాధిత వ్యక్తి వివరాల ప్రకారం, కృష్ణ అనే వ్యక్తి ధర్మవరం మున్సిపల్​ కార్యాలయంలో అటెండర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఓ విషయంలో వైఎస్సార్​సీపీ కౌన్సిలర్​ రమణ మీద తాను కేసు పెట్టగా, కేసు వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్​ వేధింపులకు (YSRCP Councilor Harassment) గురి చేస్తున్నట్లు కృష్ణ వివరించాడు. ఈ విషయంలో తన ఉద్యోగం తీసివేయించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించాడు. 

తనకు అప్పటికే కుటుంబ సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొదటి భార్య కుమారుడు తనపై కోపంతో ఉన్నాడని, ఇటువంటి సమయంలో కౌన్సిలర్​ వేధిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరిస్తూ, విష ద్రావం సేవించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాదితుడ్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details