ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇండోసోల్‌ కంపెనీతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది: బాలశౌరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 7:43 AM IST

MP Balasouri Fires On YSRCP government: షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ కంపెనీ వాల్యుయేషన్‌(Indosol Company Valuation) గేమ్‌కు తెరలేపిందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆరోపించారు. ఎన్నికలకు ముందు విదేశీ కంపెనీలకు అమ్మేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ విలువను విపరీతంగా పెంచేసి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండోసోల్‌ పుట్టుకే అవినీతిమయమన్నారు. దీని పేరిట దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని తెలిపారు. 2022లో కేవలం లక్ష మూలధనంతో ప్రారంభమైన కంపెనీకి జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.23 వేల కోట్ల విలువైన విద్యుత్‌ రాయితీలు ఇవ్వడంలో లోగుట్టు ఏమిటని ప్రశ్నించారు.

Balasouri Comments in Shirdisai Electricals Company: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు నడిపించే చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలకు వర్తింపజేయని విద్యుత్‌ రాయితీలను బడాబాబుల పేరుతో నడుస్తున్న ఇండోసోల్‌కు ఇవ్వడం మోసం కాదా అని నిలదీశారు. ఇండోసోల్‌ లాంటి అవినీతి సంస్థలకు రాయితీ పైన విద్యుత్‌ సరఫరా చేయడం వల్లే ఏటా విద్యుత్‌ ధరలు పెరిగి ఆ భారం చివరికి పేదలపై పడుతోందని విమర్శించారు. షిరిడీ సాయి సంస్థ వ్యవహారం మొత్తం అతి పెద్ద వాల్యూషన్‌ గేమ్ అని విమర్శించారు. చిన్నతరహా సామాజిక వర్గాలు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని బాలశౌరి మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details