ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తప్పుల తడకగా ఓటరు తుది జాబితా - ఒకే ఇంటి నంబరుతో 60 ఓట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 12:26 PM IST

Mistakes_in_Voters_List

Mistakes in Voters List: ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. మృతి చెందిన వారి ఓట్లు భారీగా ఉన్నాయి. మృతుల ఓటర్లతో పాటు ఒకరికే రెండేసి ఓట్లు ఉన్నాయని బయటపడుతున్నాయి. రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితాపై పలుమార్లు నిర్వహించిన సమావేశంలో ఒకే ఇంటి నంబర్లతో పలు ఓట్లు ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. అయినా ఫలితం శూన్యం. మళ్లీ అవే తప్పులు పునరావృతమయ్యాయి. 

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల పరిధిలో వివిధ పోలింగ్ బూత్​లలో ఒకే ఇంటి నంబరుతో 60 ఓట్లు దాకా ఉన్నాయన్నారు. ఇందులో 176 పోలింగ్ బూత్​లో 45, 173 పోలింగ్ బూత్​లో 15 ఓట్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రాజకీయ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇలా రెండు పోలింగ్ కేంద్రాల్లోనే ఇన్ని ఓట్లుంటే, మిగిలిన బూత్​లలో ఎలా ఉంటాయనే అనుమానాలను ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details