ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాచర్లలో 151 సమస్యాత్మక కేంద్రాలు- ఆర్వో శ్యామ్‌ - Shyam Prasad Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 8:22 PM IST

మాచర్లలో 151 సమస్యాత్మక కేంద్రాలు - వృద్ధులకు అత్యవసర సదుపాయలు ఏర్పాటు (ETV Bharat)

Macharla RO Shyam Prasad Interview: రాష్ట్రంలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో ముఖ్యమైన మాచర్లలో పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామని మాచర్ల ఆర్వో శ్యామ్‌ ప్రసాద్‌ చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 151 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 6 కంపెనీల కేంద్ర బలగాలు, ప్రతి పోలింగ్ స్టేషన్​లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శ్యామ్​ ప్రసాద్​ తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు చర్యలు చేపట్టామని ఆర్వో తెలిపారు. 

అన్ని పోలింగ్​ కేంద్రాలలో వెబ్​ క్యామ్​, మైక్రో పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు శ్యామ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్​ స్టేషన్​ వద్ద​ ఐదుగురు సాయుధ బలగాలు కచ్చితంగా ఉంటారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో వృద్ధులకు అత్యవసర వైద్య సదుపాయాలు, మంచినీటి సౌకర్యాలను అందుబాటులో మాచర్ల ఆర్వో తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details