ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐదేళ్లుగా జైళ్లో పెట్టి దళితులపై ప్రేమ ఉందంటే ఎలా? - జగన్​పై మండిపడ్డ ఠాణేలంక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 1:50 PM IST

Kodi Kathi Srinu Family Protest Against Cm Jagan : కోడికత్తి  శ్రీను విడుదలకు సీఎం జగన్‌ సహకరించాలని డిమాండ్‌ చేస్తూ కోనసీమ జిల్లా ఠాణేలంకలో దళితులు నిరసనకు దిగారు. శ్రీను తండ్రి తాతారావుతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దళితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఇలా దళిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

Kodi Kathi Srinu Family Hunger Strike : ఐదేళ్లుగా వారి కొడుకు కోసం ఎదురు చూస్తున్నామని కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబానికి అండగా ఉన్న తన కొడుకును దూరం చేశారని వాపోయాడు. కన్న కొడుకు జైళ్లో మగ్గుతుంటే తల్లిదండ్రులం నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. శ్రీను కుటుంబ సభ్యులకు మద్దతుగా స్థానికులు అంబేడ్కర్​ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ సీఎం నిర్లక్ష్య వైఖరి వీడాలని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details