ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎక్కడికి వెళ్లినా టీడీపీ హయాంలో వేసిన రోడ్లే కనిపిస్తున్నాయి : వెనిగండ్ల రాము - MLA Candidate Venigandla Ramu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 5:04 PM IST

Gudivada MLA Candidate

Gudivada MLA Candidate Venigandla Ramu: కృష్ణా జిల్లా గుడివాడ 32వ వార్డులో కూటమి పార్టీల అభ్యర్ధి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల శ్రేణులతో కలిసి బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వార్డుకి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని రాము ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాము టీడీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నారో తెలియని వ్యక్తి ఇన్నాళ్లు మనకు ఎమ్మెల్యేగా కొనసాగాడన్నారు. ఓట్ల రాజకీయం తప్ప గుడివాడ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు పట్టవని రాము విమర్శించారు. 

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని రాము ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా గతంలో టీడీపీ వేసిన రోడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ప్రజల అవసరాలకు తీర్చలేని ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వాలంటీర్​ వ్యవస్థను కొనసాగిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాక, వారి జీతాలు రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details