ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువు తవ్వకం పేరుతో భూ ఆక్రమణకు వైసీపీ నేతల యత్నం-అడ్డుకున్న దళిత రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 3:32 PM IST

Farmers Agitation For Lands

Farmers Agitation For Lands YCP Leaders Try to Occupy Land దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములను చెరువు నిర్మాణం పేరుతో వైసీపీ నేతల ఆక్రమించేందుకు ప్రయత్నాలను రైతులు అడ్డుకున్నారు. గుంటూరు గ్రామీణ మండలం తోకవారిపాలెంలో వందేళ్లకు పైగా సాగు చేసుకుంటున్న భూములను చెరువు పేరుతో కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని స్థానిక దళిత రైతులు మండిపడ్డారు. వైసీపీ నేతల భూముల ఆక్రమణలపై వారు నిలదీశారు. దాదాపు 60 సంవత్సరాలుగా 20 మంది దళిత రైతులు ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. 

అధికార పార్టీ సర్పంచ్‌, స్థానిక వైసీపీ నేతలు రైతులు సాగు చేసుకుంటున్న ప్రదేశంలో చెరువు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజకు ఏర్పాట్లు చేయడంపై దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణను సహించేది లేదంటూ పిల్లాపాపలతో కలిసి పెట్రోల్ డబ్బాలు చేతబట్టుకుని రైతులు ఆందోళనకు దిగారు. గతంలోనూ ఇదే మాదిరి భూములు లాక్కునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరిత వారికి అండగా నిలిచారని రైతులు పేర్కొన్నారు. చెరువు నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని దళిత రైతులు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details