ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంటింటికి కుళాయిలు ఎక్కడ ? - రోడ్డుపై మహిళల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 4:53 PM IST

Drinking Water Crisis at Taatikayala Vaaripalem: ఇంటింటికి (Each House) తాగు నీళ్లు అందిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది కానీ నీటి సరఫరా చేసేందుకు పైప్​లైన్లు (Pipelines) వేయటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో గొంతెండి పోతున్నా గుక్కెడు తాగునీళ్లు ఇవ్వకపోవడంపై గృహిణులు ఆవేదన చెంది రోడ్డుపై బిందెలతో నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. 

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని తాటికాయలవారి పాలెంలో ప్రజలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహించిన గృహిణులు గ్రామానికి ఎదురుగా ఉన్న రాజవరం - పొదలాడ రహదారిపై (Rajavaram-podalaada) రాస్తారోకోకు దిగారు. తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు నినాదాలు చేశారు. ఇంటింటికి కుళాయిలు అన్నారు, అవి ఎక్కడున్నాయంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details