ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నోటిఫికేషన్ రాకముందే ప్రలోభాలు - ఇలాంటివాళ్లకు బుద్ధి చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 2:00 PM IST

CPI_Ramakrishna_on_Gifts_Distribution_to_Voters

CPI Ramakrishna on Gifts Distribution to Voters: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో జగన్, చంద్రబాబు బీజేపీ ప్రభుత్వ కన్నుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ తలపై ఉన్న కేసులు భయంతోనే కేంద్రం చెప్పినట్లు పని చేస్తున్నారని అన్నారు. మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఏ ఆధారాలు లేకపోయినా చంద్రబాబును జైలులో చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా బలం కలిగిన రెండు పార్టీలు బీజేపీ ప్రభుత్వం కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. 

రాష్ట్రంలో ఒక్కరైనా రైతుల పరిస్థితులు, ధరల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సంస్థల ఆస్తులను తాకట్టుపెట్టి 26 వేల కోట్లు అప్పులు చేశారని గుర్తు చేశారు. ఇవాళ ఏకంగా సెక్రటేరియట్ కార్యాలయాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. త్వరలో తమ పార్టీ ఎన్నికల విధి విధానాలను వివరిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details