ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్ కల్యాణ్ ఏ ఒక్క కులానికో నాయకుడు కాదు: కిరణ్ కుమార్ రెడ్డి - Nallari Kiran Kumar Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 5:13 PM IST

BJP MP candidate Nallari Kiran Kumar Reddy

BJP MP candidate Nallari Kiran Kumar Reddy: బలిజలు ఐక్యతను చాటుతూ ముందుకు నడవాలని రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ఎన్డీఏ కూటమిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జనసేన ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చట్టబద్ధతలేని రాజకీయ వ్యాపారం జరుగుతుందని, ఇందుకు వైసీపీ ప్రభుత్వం నిదర్శనమని ఆరోపించారు. 

పవన్ కల్యాణ్ ఏ ఒక్క కులానికో నాయుకుడు కాదన్నారు. పవన్ అదంరికీ నాయకుడని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పేదల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకువచ్చారని వెల్లడించారు. 2029 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. మేలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు లోబడకుండా జాగ్రతపడాలని పేర్కొన్నారు. బలిజ సామాజిక ఓటర్లు ఎన్డీఏ కూటమి మద్ధతు ఇవ్వాలని కోరారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నారు.  

ABOUT THE AUTHOR

...view details