ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం - మత్స్యకారులకు అవస్థలే !

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 12:38 PM IST

AP Govt Ban Marine Fishing: రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కోస్తాంధ్ర సముద్ర తీరంలో 61 రోజుల పాటు చేపల వేటపై నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. సాధారణ బోట్లు మినహా ఫిషింగ్ బోట్లు, మోటరు బోట్లు నిషేధిత సమయాల్లో వేటకు వెళ్లకూడదని నోటిఫికేషన్​లో వెల్లడించింది.  

కాగా చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా నిషేధం విధించటంతో తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు, బోటు యజమానులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో బాసటగా నిలిచినా తమకు కష్టాలు తప్పవని మత్స్యకారులు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details