ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు- ఆంధ్ర హాస్పిటల్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 4:44 PM IST

Andhra Hospital - Healing Little Hearts Free Heart Surgeries in Vijayawada : విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి - యూకేకి చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ సౌజన్యంతో తొమ్మిదేళ్లుగా నాలుగు వేల ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో సీనియర్‌ కార్డియాలజిస్టుగా సేవలందిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన డాక్టరు లక్కిరెడ్డి హనిమరెడ్డి ఆర్థిక సహాయంతో ఐదు రోజుల్లో 28 ఆపరేషన్లు చేసినట్లు ఆంధ్ర ఆసుపత్రుల శిశు వైద్య విభాగాధిపతి డాక్టరు పి.వి.రామారావు పేర్కొన్నారు. ఆంధ్ర హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఆసుపత్రిలో అత్యధికంగా పిల్లల కార్డియాలజీ సర్జీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఆంధ్ర హాస్పిటల్స్ లో నెలల చిన్నారి నుంచి 25 ఏళ్ల వయస్సు వారికి ఉచితంగా వైద్యం అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన చికిత్సలను కూడా హీలింగ్​ లిటిల్​ హార్ట్స్, ఆంధ్ర ఆసుపత్రి కార్డియాలజిస్టు విభాగం సంయుక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పిల్లల కార్డియాలజీ సర్జీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నెలకు 50 నుంచి 60 శస్త్ర చికిత్సలు చొప్పున ఏడాదికి ఆరు వందల వరకు చేశామని వారు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details