ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని ఆశీర్వదించండి : అమరావతి రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:30 PM IST

Amaravati Farmers says CM Jagan Destroyed AP State : సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అభివృద్ధి కరవైందని, ప్రజలు సైతం విసిగిపోయారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'అమరావతి రాజధాని కాపాడుకుందాం - కలిసి రండి కదలిరండి' అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చారు. రాష్ట్రాని అభివృద్ది చేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబును అపార్థం చేసుకోవద్దని సూచించారు. వారి కూటమిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని కండ్రిక గ్రామంలో ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరిగి తమ గోడు వివరించుకుంటూ చంద్రబాబు గెలుపునకు సహకరించాలని కరపత్రాలను పంచారు. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంబీఏ, బీటెక్​లు చేసినవారు ఉద్యోగాలు లేక ఖాళీగా ఇళ్ల దగ్గర కూర్చుని ఉన్నారని తెలిపారు. కేవలం సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరగదని ప్రజలకు వివరించారు. ఉచిత పథకాలు అనేవి ఏ ప్రభుత్వంలోనైనా వస్తాయని, అభివృద్ధి చేసే మంచి నాయకులను ఎన్నుకొవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తమ ఓటు వేయాలని అమరావతి రైతులు విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details