ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ అక్రమాస్తుల కేసు- న్యాయమూర్తి బదిలీ! మళ్లీ మొదటికొచ్చిన డిశ్చార్జి పిటిషన్ల విచారణ - Jagan Disproportionate Assets Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:10 PM IST

YS Jagan Disproportionate Assets Case: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి కొచ్చింది. రేపు రిలీవ్ కానున్న సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు, తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని వెల్లడించారు. కొత్త జడ్జి మళ్లీ మొదట్నుంచి వాదనలు వినేందుకు డిశ్చార్జి పిటిషన్లను మే 15కి వాయిదా వేశారు.

YS Jagan Disproportionate Assets Case
YS Jagan Disproportionate Assets Case

YS Jagan Disproportionate Assets Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లు రీఓపెన్ చేశారు. డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు హైకోర్టు ఇవాళ్టి వరకు గడువు విధించినప్పటికీ, తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని జడ్జి తెలిపారు. గడువులోగా తీర్పు ఇవ్వలేక పోవడానికి కారణాలను వివరిస్తూ హైకోర్టుకు లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లోని 130 డిశ్చార్జి పిటిషన్లపై కొత్త జడ్జి మళ్లీ వాదనలు వినేందుకు మే 15కి వాయిదా వేశారు.

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి కొచ్చింది. రేపు రిలీవ్ కానున్న సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు, తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని వెల్లడించారు. కొత్త జడ్జి మళ్లీ మొదట్నుంచి వాదనలు వినేందుకు డిశ్చార్జి పిటిషన్లను మే 15కి వాయిదా వేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, పి.శరత్ చంద్రారెడ్డి, పి.ప్రతాప్ రెడ్డి, పునీత్ దాల్మియా, జితేంద్ర వీర్వాణి, నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఎం.శామ్యూల్, బీపీ ఆచార్య, జి.వెంకట్రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, వి.డి.రాజగోపాల్, ఎస్.ఎన్.మొహంతి, తదితరులు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేశారు. సీబీఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడంతో.. మళ్లీ మొదట్నుంచి ప్రారంభమవుతున్నాయి.


చెల్లెమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists

ఈ కేసు సుదీర్ఘ విచారణ సందర్భంగా గత పదకొండేళ్లలో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. సీహెచ్.రమేష్ బాబు 2022 మే 4 నుంచి సుదీర్ఘంగా వాదనలు వినడంతో విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లైంది. కేసు నుంచి తొలగించాలని నిందితులు వాదించగా, జగన్ సహా నిందితులందరిపై అభియోగాలు నమోదు చేసి ట్రయల్ ప్రారంభించాలని సీబీఐ, ఈడీ కోరాయి. మరోవైపు సుప్రీంకోర్టు చొరవతో, డిశ్చార్జి పిటిషన్లను ఫిబ్రవరి 15 నాటికి తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే వాదనలు పూర్తయినప్పటికీ, సుమారు 13వేల పేజీలు పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును సీబీఐ కోర్టు కోరింది. హైకోర్టు పెంచిన గడువు నేటితో ముగియనుండటంతో, ఇవాళ తీర్పు వెలుపడవచ్చునని న్యాయవాదులు భావించారు.

అయితే తనకు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని న్యాయమూర్తి సీహెచ్.రమేష్ బాబు ఇవాళ వెల్లడించారు. గడువులోగా తీర్పు ఇవ్వలేక పోవడానికి కారణాలు వివరిస్తూ హైకోర్టుకు లేఖ రాశారు. మరోవైపు జడ్జి రమేష్ బాబును హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సీబీఐ కోర్టుకు టి.రఘురాంను నియమిస్తూ ఈనెల 19న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి మే1న రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో తెలిపింది. రేపు జడ్జి రిలీవ్ కానున్నందు.. సీబీఐ, ఈడీ కేసుల్లోని 130 డిశ్చార్జి పిటిషన్లను రీఓపెన్ చేశారు. కొత్త న్యాయమూర్తి మళ్లీ మొదట్నుంచి వినేందుకు డిశ్చార్జి పిటిషన్లను మే 15కి వాయిదా వేసింది.

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలే - CM Jagan Election Affidavit

ABOUT THE AUTHOR

...view details