ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం తాగొచ్చి వేధింపులు - భర్త గొంతు కోసి రాడ్డుతో కొట్టి చంపిన భార్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 5:30 PM IST

Wife Killed Husband in Annamayya District : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో భర్త మృతి చెందాడు. రోజూ మద్యం సేవించి వచ్చి వేధించడంతో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మద్యం మత్తులో భార్యను చంపేందుకు యత్నించగా ఆమె ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నంలో భర్త మృతి చెందాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

Wife_Killed_Husband_in_Annamayya_District
Wife_Killed_Husband_in_Annamayya_Distric

Wife Killed Husband in Annamayya District :భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల్లో ఎక్కువ శాతం భర్తలే భార్యలను హతమార్చిన ఘటనలను ఇది వరకు చూశాం. కానీ, మారుతున్న నాగరికతలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చిన క్షణికావేశంలో భర్తలను భార్యలు హత్యచేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కట్టుకున్న భార్యే తన భర్తను గొంతు కోసి, రాడ్డుతో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన జిల్లాలోని ఓబులావారి పల్లి మండలం మంగంపేటలో చోటు చేసుకుంది.

అన్నమయ్య జిల్లాలో దారుణం - భర్త గొంతు కోసి, రాడ్డుతో కొట్టి చంపిన భార్య

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని మంగంపేట గ్రామానికి చెందిన తిమ్మప్ప (46) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య నరసమ్మ మంగంపేట ఏపీఎండిసి సంస్థలో అటెండర్​గా పనిచేస్తుంది. భర్త తిమ్మప్ప ప్రతి రోజు తాగి వచ్చి భార్యను వేదించేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవించద్దని భార్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా నిత్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడని తెలుస్తోంది. ఈ బాధను ఎంతోకాలంగా ఓపికగా సహించిన నరసమ్మకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.

Wife Murdered Husband : దీంతో ఎప్పటిలాగే మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన తిమ్మప్ప భార్యతో గొడవపడి ఆమెను ఉరివేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఆహావేశానికి గురైన నరసమ్మ కోపం తట్టుకోలేక భర్తను గొంతు కోసి, రాడ్డుతో కొట్టి చంపింది. అయితే నరసమ్మ రోజు తాను పడుతున్న బాధలను తట్టుకోలేక ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా తాగుబోతు భర్త నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే హత్య చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం భార్య నరసమ్మపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Mother and Daughter Died in Nandyala District :అదేవిధంగా నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంటలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు కళ్లాపి చల్లే పొడి తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పాలు తాగిన మూడు నెలల చిన్నారి సైతం మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

అడ్డదారులు తొక్కిన ఆవిడ.. వదిలించుకోవాలనుకున్న ఆయన.. చివరకు

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నంద్యాల జిల్లాలోని ఎర్రగుంటకు చెందిన ఇందుమతి (25) అనే మహిళ అదే జిల్లాలోని చాగలమర్రి మండలం తోడేళ్లపల్లెకు చెందిన సతీష్ రెడ్డి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇటివలే ఓ పాప జన్మించింది. ఈ మధ్యనే పుట్టింటికి వచ్చిన ఇందుమతి ఆత్మహత్య చేసుకొవాలని ఇంట్లోవున్న కళ్లాపి పొడి తాగింది. అనంతరం మూడు నెలల చిన్నారికి పాలు తాపింది. దీంతో కొద్దిసేపటికే తల్లి, కూమార్తె ఇద్దరు మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. వీరి మృతిపై విచారణ చేపట్టారు.

భర్తను చంపి 50మీటర్ల లోతులో పాతిపెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి ఘాతుకం

ABOUT THE AUTHOR

...view details