ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు: ఛైర్మన్​ అంగముత్తు - VISAKHAPATNAM PORT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 7:18 PM IST

Updated : Mar 29, 2024, 7:52 PM IST

Visakhapatnam Port Record : సరకు రవాణా చేయడంలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఈ రికార్డు సాధించినందుకు పోర్టు ఛైర్మన్​ ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ పోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం కోసం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

visakha_port
visakha_port

Visakhapatnam Port Record : విశాఖ పోర్టు సరకు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పోర్టు చరిత్రలోనే అత్యధికంగా 80.05 మిలియన్​ మెట్రిక్​ టన్నుల సరకును రవాణా చేసిందని పోర్టు ఛైర్మన్​ డా. ఎం అంగముత్తు వెల్లడించారు. 2023-24వ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల ఉండగానే ఈ ఘనతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. అత్యధికంగా సరకు రవాణా చేయడంలో పలు రంగాల్లో పురోగతి నమోదు చేసిందని పేర్కొన్నారు.

వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్​పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?: ముప్పాళ్ల - Cpi Muppalla On Drugs Issue

గత ఏడాదితో పోలుస్తే క్రూడ్​ ఆయిల్​ రవాణాలో 27 శాతం, ఇనుప ఖనిజం 12 శాతం, ఎరువులు 6 శాతం పెరుగుదలను నమోదు చేసిందని అంగముత్తు తెలియజేశారు. 43 భీమ్​ కలిగిన బేబీ కేప్​ నౌకలు గత ఏడాదితో పోలుస్తే అధికంగా ఇన్నర్​ హార్బర్​లో కార్యకలాపాలు నిర్వహించాయని పేర్కొన్నారు. పోర్టులోనికి వచ్చిన నౌకలలో సైతం 35 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు.

విశాఖ కంటైనర్ టెర్మినల్ (Visakha Container Terminal) 28 శాతం అధికంగా 6.65 లక్షల టీఈయులను హ్యాండిల్ చేసిందని అంగముత్తు వెల్లడించారు. ప్రీ బెర్తింగ్ డిటెన్షన్​లో 68శాతం, టర్న్ అరౌండ్ టైం, అవుట్ పుట్ ఫర్ షిప్ బెర్త్ డేలో 10 శాతం, ఐడల్ టైం బెర్తింగ్​లో 8 శాతం మెరుగుదలను నమోదైందని పేర్కొన్నారు. 2023 మే, జూన్, అక్టోబర్ , జనవరి 2024లో నెలలో అత్యధిక సరకు రవాణా రికార్డులను నెలకొల్పిందని ఈ సందర్భంగా వెల్లడించారు.

విశాఖ పోర్టును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ప్రత్యేక దృష్టి : ఛైర్మన్​ అంగముత్తు

త్వరలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు: విశాఖ పోర్టు చైర్మన్​

2024 జనవరి 19న ఒక్కరోజులో 4,03,978 మిలియన్​ టన్నుల సరకును రవాణా చేసి గత ఏడాది జూన్ 17న (4,01,875)​ నెలకొల్పిన రికార్డును తిరగరాసిందని అంగముత్తు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ పోర్టును ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోర్టు నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు, వాణిజ్యంలో నూతన విధానాలపై దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు. పోర్టు రోడ్లు నిర్వహణ, పార్క్​ల నిర్మాణం, పచ్చదనం పెంపొందించే పలు పనులను చేపట్టినట్లు ఈ సందర్బంగా తెలియజేశారు. పోర్టు పరిసరాల పరిశుభ్రతకు, కాలుష్య నివారణకు పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం వల్ల దేశంలోని మేజర్​ పోర్టులలో ప్రధమ స్థానంలో నిలిచిందని తెలియజేశారు.

Last Updated : Mar 29, 2024, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details