Several People Died in Road Accidents Across AP:కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కడప నుంచి వెళ్తున్న లారీ బెంగళూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు రెండో మలుపు వద్దకు రాగానే రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. లారీ సమీప లోయలోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదాన్ని గల కారణాల పై విచారణ చేస్తున్నారు.
వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు
Palnadu District:వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం బొలెరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన శీలం కోటిరెడ్డి, శీలం శివారెడ్డి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తున్న బొలెరో వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు - పది మంది మృతి
Vijayawada:విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రు వద్ద పలు వాహనాలు వరుసగా ఢీ కొన్నాయి. కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అనూహ్యంగా పొగముంచు కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - చర్యలు శూన్యం
Sri Sathya Sai District:ఎద్దుల బండిని లారీ ఢీకొన్న ప్రమాదంలో రైతుతో పాటు ఒక ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని తనకల్లు సమీపంలో జాతీయ రహదారి 42పై లారీ అతివేగంతో ఎద్దుల బండి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతు వెంకటరమణతో పాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. తనకల్లుకు చెందిన వెంకటరమణ వ్యవసాయ కూలీ. వ్యక్తిగత అవసరాల కోసం పాపాగ్ని నది నుంచి ఇసుక తీసుకొచ్చేందుకు ఎద్దులు బండితో వేకువజామునే బయలుదేరారు.
కదిరి వైపు నుంచి మదనపల్లికి వెళ్తున్న లారీ వేగంగా ఎద్దులు బండిని ఢీకొని పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొంది. కొన్ని అడుగుల మేర ఎద్దుల బండిని లారీ ఈడ్చుకెళ్లడంతో రైతుతో పాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి రైతును కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. మృతుడు వెంకటరమణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.