ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీజేపీతో కలిసినా - టీడీపీ ముస్లింలకు మంచే చేస్తుంది: మైనార్టీ నేతలు - Muslim Community Vote Bank

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:08 PM IST

Muslim Community Vote Bank: ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే ఓట్లేసి గెలిపిస్తామని ముస్లిం మైనార్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. గుంటూరులోని ఓ హోటల్లో ముస్లిం మైనార్టీలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షిబ్లీ అన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవటం వల్ల ముస్లింలకు రిజర్వేషన్లు పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Muslim Community Vote Bank
Muslim Community Vote Bank

Muslim Community Vote Bank: రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓట్లేసి గెలిపిస్తామని ముస్లిం మైనార్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. గుంటూరులోని ఓ హోటల్లో మైనార్టీ సంఘాలు సమావేశమై ఈ మేరకు తీర్మానించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షిబ్లీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ బీజేపీతో కలవటం వల్ల ముస్లిం రిజర్వేషన్లు పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

బీజేపీతో కలిసినా - టీడీపీ ముస్లింలకు మంచే చేస్తుంది: మైనార్టీ నేతలు

చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉండగా ముస్లింల హక్కులకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదని.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంటులో కేంద్రం చేసే ప్రతీ చట్టానికి వైసీపీ ఎంపీలు మద్దతు పలికారని గుర్తు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలించటం ముస్లింల ఉపాధికి దెబ్బ పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీ లకు 28వేల కోట్లు ఖర్చు చేశామని జగన్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని, కేవలం రూ 4,565 కోట్లు నవరత్నాల్లో భాగంగా ఖర్చు చేశారని వివరించారు. మధ్యాహ్నం భోజనం ఖర్చులు కూడా మైనార్టీ సంక్షేమంగా చూపటంపై మండిపడ్డారు.

ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాజావళి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో మాత్రమే మైనార్టీలకు సంక్షేమం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో మైనార్టీలకు రాయితీలు, బ్యాంకు రుణాలు రావటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీని బూచిగా చూపి మైనారిటీలను మోసం చేస్తున్నారని.. అందుకే తామంతా అప్రమత్తంగా ఉండి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నిర్ణయించామని వివరించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ వస్తేనే మైనార్టీలకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడే ముస్లిం లకు రిజర్వేషన్లు కాపాడారని గుర్తు చేశారు. వైసీపీ గెలిచిన తర్వాత బీజేపీతో కలుస్తామని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారని, దీనిపై వైసీపీ ముస్లిం నాయకులు ఏం చెబుతారని ప్రశ్నించారు.
జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశం - Supreme Court Orders to AP Govt

వైసీపీకి ముస్లింల ఓటు బ్యాంక్ దూరం అవుతుందనే భయం పట్టుకుంది. బీజేపీతో కలిస్తే ఏదో జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో సైతం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇదే వైసీపీ సీఐఏకు మద్ధుతు తెలిపింది. నవరత్నాల పేరుతో అందరికీ ఇస్తున్నట్లు ముస్లింలకు పథకాలు ఇస్తునే, ముస్లింల కోసంఏదో చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ ఎంపీలు బీజేపీ తెచ్చిన అన్ని చట్టాలకు పూర్తి మద్ధతు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ముస్లింలు సైతం భాగస్వాములే, జగన్ ఓటమి కోసం అంతా కలిసి పోరాడుతాం. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు

Prathidhwani: నాలుగేళ్లలో ముస్లింలకు వైసీపీ సర్కార్ చేసిందేమిటి?

ABOUT THE AUTHOR

...view details