ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం - Sajjala Bhargava Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 9:01 PM IST

CID inquiry against Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్‌ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ, విద్వేషాలు రగిల్చేలా దుష్ప్రచారం చేశారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య భార్గవరెడ్డిపై ఫిర్యాదు చేశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

CID inquiry against Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సోషల్‌ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేశారని తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేసింది. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా IVRS ఐవీఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తునకు ఈసీ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ఈసీ పేర్కొంది.

సోషల్ మీడియాలో చంద్రబాబు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం చేసిన ఫిర్యాదు పై ఎన్నికల సంఘం స్పందించింది. సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణం అని ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేసిందని తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. కుట్రతో, విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్స్ ను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డిజి కి ఆదేశాలు జారీ చేసింది.


వైసీపీ విధ్వంసానికి పోలవరంపై అనిశ్చితి - రివర్స్‌ నిర్ణయాలతో సాగని నిర్మాణం - negligence on polavaram project

సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశానికి నష్టం చేకూర్చేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. టీడీపీ నేతల్లా వేషాలు వేయించి.. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తిట్టిస్తూ తద్వారా పార్టీకి నష్టం చేకూర్చేలా ప్లాన్ వేశారని ఆగ్రహం వ్యక్తం ఆరోపించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డి కలసి ఫేక్ వీడియోలతో ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ లబ్ది కోసం ఆ ఇద్దరితో ఇలాంటి చండాలపు పనులు చేయిస్తున్నారని విమర్శించారు. ఆ నకిలీ వీడియో వ్యవహారంపై సీఐడీతో పాటుగా ఈసీకి కంప్లైంట్ చేశారు. వర్ల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ సజ్జల భార్గవ్​పై సీఐడీ విచారణకు ఆదేశించింది.

జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

ABOUT THE AUTHOR

...view details