ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐవీఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత్ బయోటెక్ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల - IVMA President Krishna Ella

krishna ella charge over as IVMA President : ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్ల ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నట్లు ఐవీఎంఏ పేర్కొంది. కృష్ణ ఎల్లతో పాటు మరికొందరు వివిధ పదవుల్లో బాధ్యతలు చేపట్టారు.

krishna_ella
krishna_ella

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:29 PM IST

Bharat Biotech CEO Krishna Ella Charge over as IVMA President :ఇండియన్ వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ)కి అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ సంస్థ ఛైర్మన్ కృష్ణ ఎల్ల బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఐవీఎంఏ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఐవీఎంఏ వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు అదర్ సి పూనావాలా నుంచి కృష్ణ ఎల్ల బాధ్యతలు స్వీకరించారు.

బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా భారత్ బయోటెక్ సీఎఫ్​ఓ శ్రీనివాస్ కోశాధికారిగా, డాక్టర్ హర్షవర్ధన్ ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్​గా కొనసాగనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రాణాలను కాపాడే వ్యాధి నిరోధక టీకాలను అందరికీ అందించటమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు.

జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశం - Supreme Court Orders to AP Govt

ABOUT THE AUTHOR

...view details