ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ-జనసేన సభకు భారీ స్పందన - 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 5:56 PM IST

Huge Crowd Attend Janasena-TDP Public Meeting: 'జెండా' పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న ఉమ్మడి బహిరంగ సభకు తెలుగుదేశం - జనసేన కార్యకర్తలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున హాజరయ్యారు. అభ్యర్ధులను ప్రకటించాక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

janasena_tdp
janasena_tdp

Huge Crowd Attend Janasena-TDP Public Meeting:తెలుగుదేశం- జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇరు పార్టీల నేతలు స్టేజ్ పంచుకోవడం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సభకు సుమారు 7 లక్షల మంది హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవటంతో వేలాదిమంది అభిమానులు జాతీయ రహదారిపై నుంచే వీక్షిస్తున్నారు. తాడేపల్లిగూడెం - తణుకు మధ్య జాతీయ రహదారి స్తంభించిపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నాగబాబులు తాడేపల్లిగూడెం చేరుకున్నారు.

తెలుగు జన విజయకేతనం నినాదంతో జెండా పేరిట నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభలో ఇరు పార్టీల శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా ఇరు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 99 మంది అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రేణుల వాహనాల్ని 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేస్తున్నప్పటికీ అడ్డంకుల్ని ఛేదించుకుని సభాస్థలికి చేరుకున్నారు. వేదికపై దాదాపు 500 మంది ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. కూర్చుని సభ తిలకేంచేందుకు వీలుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ

Huge Rally from Rajahendravaram:తెలుగుదేశం-జనసేన బహిరంగ సభకు రాజహేంద్రవరం నుంచి ఇరు పార్టీల శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వీఎల్పురం పాత లారీ స్టాండ్ వద్ద నుంచి బైక్​లు కార్లులో భారీగా వెళ్లారు. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి వాసు, జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ర్యాలీ ప్రారంభించారు. జగన్ పతనం ప్రారంభమైందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన విజయం ఖాయమని నాయకులు అభిప్రాయపడ్డారు.

Tanuku Constituency:తణుకు నుంచి తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి మహాసభకు భారీ స్థాయిలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పసుపుదళం, జనసైనిక దళం బైకుల, ఆటోలు, కారులు మీద తరలి వెళ్లారు. తెలుగుదేశం- జనసేన పార్టీల పొత్తులో భాగంగా తొలిసారి ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో భారీ మహాసభ ఏర్పాటు చేయడంతో. ఈ మహాసభకు తణుకు నియోజవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆరిమిల్లి రాధాకృష్ణ సారధ్యంలో నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.

రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్

Kakinada District:తెలుగుదేశం- పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కల్యాణ్​ల ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జరుగుతున్న జెండా సభకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 360 కార్లలో సుమారు 2000 మంది టీడీపీ కార్యకర్తలతో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ బయలు దేరి వెళ్లారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సత్య ప్రభ మాట్లాడుతూ రాజా గారి వర్ధంతి వేడుకలలో ఉన్నప్పటికీ నేను ఇచ్చిన పిలుపు మేరకు భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు తాడిబోయిన చంద్ర శేఖర్ యాదవ్, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే

Nidadavolu Constituency:జెండా సభకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో బైక్‌పై పసుపుదళం కదిలింది. ఊరువాడ ఏకమంటూ నినాదాలతో హోరెత్తించారు.

ABOUT THE AUTHOR

...view details