ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశం - టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 7:07 PM IST

Government Prepared anganwadi Termination Orders: అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం టెర్మినేషన్ ఆర్డర్లను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది. అంగన్వాడీల టెర్మినేషన్​కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Government Prepared anganwadi Termination Orders
Government Prepared anganwadi Termination Orders

Government Prepared anganwadi Termination Orders:అంగన్వాడీల తొలగింపునకు టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధమయ్యాయి. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ జిల్లా కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లు జారీ చేశారు. ప్రభుత్వ బెదిరింపులు, నోటీసుల జారీతో 20 శాతం మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరారు. మొత్తం లక్షా 4 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విధుల్లో చేరాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త వారిని నియమించుకునేందుకు 26న దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లు నిర్ణయించారు. ఈ నెల 24 తేదీన అంగన్వాడీల టెర్మినేషన్​కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. జనవరి 25న కొత్త వారిని నియమించుకునేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా అర్థరాత్రి వేళ అంగన్వాడీల అరెస్టులు - దౌర్జన్యంగా పోలీస్​ స్టేషన్లకు తరలింపు

Government Send Terminate Orders in District Collectors: విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్​లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరిన అంగన్వాడీ వర్కర్​లు, హెల్పర్​లను విధుల్లో తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన వారికి టర్మినేషన్ ఆర్డర్లు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో చేరిన అంగన్వాడీ హెల్పర్ లకు వర్కర్లు గా పదోన్నతులు కల్పించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్​లు, హెల్పర్​లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో నూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధం చేశారు.

అంగన్వాడీలపై పోలీసుల ఉక్కుపాదం - ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్రిక్తత


Ananthapuram District:అనంతపురం జిల్లా రాయదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో విధులకు హాజరయ్యేందుకు సోమవారం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు వచ్చారు. విధులనుంచి తొలగిస్తారని భయంతో విధుల్లోకి హాజరయ్యారు. సమ్మెను అణిచివేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అమానుషమని మండిపడ్డారు.

గడువులోగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఆదేశాలు

Unable to Pressures Authorities Anganwadi Stop the Strike:రాష్ట్ర వ్యాప్తంగా 41 రోజులు పాటు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు అధికారుల ఒత్తిళ్లను తాళలేక తాత్కాలికంగా విరమించి కంటతడి పెట్టుకొని విధులకు హాజరవుతున్న ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తి ప్రాజెక్టు పరిధిలోని గుత్తి, గుంతకల్లు, పామిడిలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకొన్నారు. నేటితో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో అంగన్వాడీలు గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జాయినింగ్ లెటర్ రాస్తూ ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. తోటి అంగన్వాడీలు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. వైద్యులు వారికి ప్రథమ చికిత్స అందించారు. 41 రోజులు పాటు సమ్మె చేసినా తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోయామని మనోవేదనతో టెన్షన్ పడి ఆసుపత్రి పాలయనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

క్షీణించిన మరో ఇద్దరు అంగన్వాడీల ఆరోగ్యం - ఆసుపత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details