ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ భేటీ- గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 9:37 AM IST

CM Jagan Meet with YSRCP Regional Coordinators: వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేసిన నియోజకవర్గ కొత్త అభ్యర్థులకు గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

CM_Jagan_Meet_with_YSRCP_Regional_Coordinators
CM_Jagan_Meet_with_YSRCP_Regional_Coordinators

CM Jagan Meet with YSRCP Regional Coordinators: అభ్యర్థుల ఎంపికలో మార్పుచేర్పులు చేసినందున నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూలడాలని సీఎం జగన్ ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81అసెంబ్లీ, 18లోక్​సభ నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్ఠానం మార్పుచేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించారు. వర్గపోరు లేకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలని సూచించారు.

సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పోలింగ్​కు చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థీ వారి పరిధిలోని అన్ని సచివాలయాలను సందర్శించేలా చూడాలని సూచించారు. ఈనెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా "మేమంతా సిద్ధం"(CM Jagan Memantha Siddham Bus Yatra) పేరుతో బస్సు యాత్రతో చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి లోక్​సభ నియోజకవర్గంలోనూ చేపట్టబోయే ఈ యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలుస్తానన్న జగన్ బహిరంగంగా సభలు ఉంటాయని వివరించారు.

ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే - వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చంద్రబాబు

ఈ సభలకు జనసమీకరణ, వారందరికీ రవాణా సదుపాయం కల్పించటం వంటి ఏర్పాట్లను ప్రాంతీయ సమన్వయకర్తలే పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహాయించి 21 లోక్​సభ నియోజకవర్గాల్లో 21 రోజులపాటు జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం కడప లోక్​సభ పరిధిలోని ఇడుపులపాయ నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్​ను నేడు విడుదల చేయనున్నట్లు సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటించారు.

"అభ్యర్థుల ఎంపికలో భాగంగా మార్పుచేర్పులు చేసిన నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రాంతీయ సమన్వయకర్తలదే. వర్గపోరు లేకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలి. పోలింగ్​కు చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థీ వారి పరిధిలోని అన్ని సచివాలయాలను సందర్శించేలా చూడాలి. ఈనెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా "మేమంతా సిద్ధం" పేరుతో బస్సు యాత్రతో చేపట్టాలని నిర్ణయించాం. ప్రతి లోక్​సభ నియోజకవర్గంలోనూ చేపట్టబోయే ఈ యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలిసి వారితో బహిరంగ సభలు నిర్వహించనున్నాం."- సీఎం జగన్

ప్రజాక్షేత్రంలోకి జగన్ - మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర

ABOUT THE AUTHOR

...view details