ఆంధ్రప్రదేశ్

andhra pradesh

27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం - 'ప్రజాగళం' పేరుతో సభలు, రోడ్ షోలు - Chandrababu Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 1:42 PM IST

Chandrababu Election Campaign: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి జోరుమీదున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 'ప్రజాగళం' పేరుతో సభలు, రోడ్ షోలు చేయనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రచించారు.

Chandrababu_Election_Campaign
Chandrababu_Election_Campaign

Chandrababu Election Campaign: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపోందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు వరుస పర్యటనలు చేయనున్నారు. 27వ తేదీన పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్​లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి. రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో అధినేత పర్యటించనున్నారు.

కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - TDP workshop

చంద్రబాబు కుప్పం పర్యటన ఇలా: చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన షెడ్యూల్‌ను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. మొదటిరోజైన సోమవారం కుప్పంలోని కొత్తపేట శ్రీకన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం కేవీఆర్‌ కల్యాణ మండపంలో ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు పాల్గొంటారు. తరువాత టీడీపీ కార్యాలయంలో స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించి, రాత్రికి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేస్తారు.

రెండోరోజు 26వ తేదీన ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం కేవీఆర్‌ కల్యాణమండపంలో వివిధ పార్టీల నాయకులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తర్వాత బాబునగర్‌లో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ-నీవా కాలువ పరిశీలిస్తారు. అనంతరం రాజుపేట నుంచి పయనమై కుప్పం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు అధినేత పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

13 ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - TDP Candidates Third List

ABOUT THE AUTHOR

...view details