ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సందడిగా నామినేషన్ల పండగ- భారీగా కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా తరలుతున్న అభ్యర్థులు - Candidate Nominations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 9:05 PM IST

Candidate Nominations for AP Elections Across the State: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు ర్యాలీలు, బల ప్రదర్శనతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంటోంది. నామినేషన్‌ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు అభిమానులు భారీగా తరలి వెళ్తున్నారు.

candidate_nominations
candidate_nominations

Candidate Nominations for AP Elections Across the State:రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. మండుటెండలోనూ పార్టీశ్రేణులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

అనకాపల్లిలో ఉద్రిక్తత - టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలు - NDA Alliance Candidates Nomination

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామినేషన్ ప్రక్రియ ఘనంగా జరిగింది. కోటబొమ్మాళి నుంచి వేల మంది కార్యకర్తలతో టెక్కలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ లోక్ సభ కూటమి అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి తేజస్విని మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో టీడీపీ కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత నామినేషన్‌ వేశారు.

కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నామినేషన్ వేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే తాడేపల్లికే జగన్‌ పరిమితం కాబోతున్నారని రఘురామ విమర్శించారు.

సీఎం జగన్ దళిత ద్రోహి - సమసమాజ స్థాపనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది: బాలకృష్ణ - Balakrishna Election Campaign

ఏలూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామపత్రాలు సమర్పించారు. దుగ్గిరాలలోని తన నివాసం నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నామినేషన్‌కు జనం భారీగా తరలివచ్చారు. తిరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య, పెడనలో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు - ఆ అధికారులపై న్యాయవిచారణ : లోకేశ్ - Nara Lokesh Election Campaign

అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు తూర్పు కూటమి అభ్యర్థి నసీర్ అహ్మద్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. గుంటూరు పశ్చిమలో కూటమి అభ్యర్థి మాధవి నామినేషన్‌ వేశారు. గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి నామపత్రాలు సమర్పించారు. బాపట్ల జిల్లా వేమూరులో కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబు నామినేషన్ దాఖలు చేశారు.

పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు భారీ జన సందోహం మధ్య నామినేషన్‌ వేశారు. మార్టూరు నుంచి పర్చూరు వరకు సాగిన భారీ ర్యాలీలో ప్రజలు ఏలూరికి బ్రహ్మరథం పట్టారు. విజయనగరం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ నామపత్రాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్ నామినేషన్‌ వేశారు.

ABOUT THE AUTHOR

...view details