ETV Bharat / city

అదనపు అభియోగపత్రం దాఖలుపై జగన్ అభ్యంతరం

author img

By

Published : Sep 20, 2019, 5:05 PM IST

వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ... సీఎం జగన్ వేసిన పిటిషన్‌ విచారణార్హతపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. గతంలో హైకోర్టు కొట్టివేసినందున మళ్లీ ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. తమ పరిస్థితులు మారినందున మళ్లీ విచారణ చేపట్టవచ్చని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. సీఎం జగన్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ తరఫు న్యాయవాది వాదనతో సీబీఐ న్యాయస్థానం ఏకీభవించింది.

జగన్

జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్ అనుబంధ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. పలువురిపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్, గనులశాఖ మాజీ అధికారి రాజగోపాల్‌, డీఆర్‌వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మపై అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.

సీబీఐ అదనపు అభియోగపత్రం దాఖలుపై సీఎం జగన్, ఇతర నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త ఆధారాలు లేకుండా అదనపు అభియోగపత్రం ఎలా దాఖలు చేస్తారని నిందితులు ప్రశ్నించారు. అదనపు అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని జగన్, ఇతర నిందితులు న్యాయస్థానాన్ని కోరారు. సీబీఐ వాదనల కోసం కేసును ఈనెల 27కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... ప్రశ్నాపత్రాలు లీకయ్యే అవకాశమే లేదు- పెద్దిరెడ్డి

Intro:ap_vsp_78_20_pashumitralu_andolana_avb_ap10082

shiva. paderu

file.. ftp

9493274036


Body:shiva


Conclusion:paderu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.