ETV Bharat / politics

"అవినాశ్​ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పండి" - పులివెందుల ప్రజలకు వైఎస్ షర్మిల, సునీత విజ్ఞప్తి - YS Sharmila Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 3:00 PM IST

Sharmila Election Campaign : రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర్​రెడ్డికి వివేకా అలాంటివారే, ప్రజల మనిషి వివేకానందరెడ్డి. అలాంటి నాయకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన వ్యక్తులు ఇంకా జనం మధ్యలో తిరుగుతున్నారని వైఎస్​ షర్మిల మండిపడ్డారు. ఐదేళ్లయినా వివేకాను హత్యచేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదని వాపోయారు. తన సోదరి సునీతతో కలిసి పులివెందుల నియోజకవర్గంలో షర్మిల ప్రచారంలో పాల్గొన్నారు.

Sharmila Election Campaign
Sharmila Election Campaign

Sharmila Election Campaign In Pulivendula : ఏపీ వైసీపీ ఎంపీ అవినాశ్​ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పండి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఓటర్లను కోరారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో తన సోదరి సునీతతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌కు వివేకా అలాంటివారే, ప్రజల మనిషి వివేకా. అలాంటి నాయకుడు ఎక్కడా కనిపించని పరిస్థితి అని షర్మిల వాపోయారు.

ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని, ఐదేళ్లయినా హత్యచేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదని వాపోయారు. హత్య చేసినవాళ్లు, చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. చిన్నాన్న హత్య విషయాలను గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన షర్మిల ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని గద్గద స్వరంతో ప్రజలను కోరారు.

Congress leader Sharmila On Y.S Viveka Death : పులివెందుల నియోజకవర్గం(Constituency) వేంపల్లెలో వైఎస్ షర్మిలారెడ్డి, ఆమె సోదరి వైఎస్​ వివేకా కూతురు సునీత ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారని తెలిపారు. వివేకా గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయినా ఇవాళ్టివరకు హత్యచేసిన వారికి, చేయించిన వారికీ శిక్ష పడలేదని పేర్కొన్నారు.

వివేకాను హత్య చేసినవాళ్లు, హత్య చేయించినవాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. వైఎస్‌ అవినాశ్​రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న వైఎస్‌ షర్మిల డబ్బు లావాదేవీల వంటి అన్ని సాక్ష్యాలను(Evidence) సీబీఐ బయటపెట్టిందని తెలిపారు. సాక్షాత్తు సీఎం జగన్‌ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారని ధ్వజమెత్తారు.

Ys Sharmila Fires On CM Jagan : హంతకులను కాపాడుకోవడం న్యాయమా? అని జగన్‌ను ప్రశ్నిస్తున్నా, సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? అని నిలదీశారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే హంతకుడిని కాపాడుకుంటారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అవినాశ్​ను జైలుకు పంపలేదని, ఐదేళ్లు అధికారంలో ఉండి అవినాశ్​కు శిక్ష పడకుండా కాపాడుతున్నారని, మళ్లీ అదే హంతకుడికి టిక్కెట్‌ ఇస్తారా? అని షర్మిల మండిపడ్డారు.

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

ఓ వైపు న్యాయం- మరోవైపు అధికారం ఉంది : ఒకవైపు వైఎస్‌ బిడ్డ, మరోవైపు హంతకుడు ఉన్నారన్న షర్మిల, ఒకవైపు న్యాయం ఉంది మరోవైపు అధికారం ఉందని ఎటు ఉండాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. న్యాయం కోసం పోరాడుతున్న తనను ఓటు(Vote) వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ(Service) చేయాలని ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఆశీర్వదించాలని కోరుతూ అవినాశ్​ను ఓడించి జగన్‌కు బుద్ధి చెప్పాలని పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం అని చెప్పారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం : వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. కరవు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా? నీళ్లు తేవడానికి ఏం కృషి చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే పదికి వందసార్లు ఆలోచిస్తామన్న సునీత మీరు ఓటు వేసిన వాళ్లు ఎక్కడున్నారు? అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మీకోసం పని చేయకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మనం న్యాయం వైపు ఉన్నామా? అన్యాయం వైపు ఉన్నామా? ఓటు వేసేముందు ఆలోచించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి అని కోరారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని, మన కోసం పోరాడే షర్మిల వైపు మనం ఉండాలని అన్నారు.

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు : వైఎస్ షర్మిల - lok Sabha Elections 20224

YS Sharmila Comments: వివేకాది రాజకీయ హత్యే.. అవినాష్‌కు వ్యతిరేకంగా నిలవడమే హత్యకు కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.