ETV Bharat / business

జియో ఫైబర్‌ నయా ప్లాన్​ - నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్ సహా 15 ఓటీటీలు ఫ్రీ! - Jio OTT Plan

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 12:39 PM IST

Jio New Unlimited OTT Plan : జియో ఫైబర్‌, జియో ఎయిర్​ఫైబర్‌ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్​తో 15 ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా కూడా వస్తుంది.

Jio Fiber OTT plans
Jio New Unlimited OTT Plan (ANI)

Jio New Unlimited OTT Plan : జియో ఫైబర్‌, జియో ఎయిర్​ఫైబర్‌ కస్టమర్ల కోసం జియో కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. రూ.888తో 'అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్'ను లాంఛ్​ చేసింది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. కొత్త వినియోగదారులతో పాటు, ఇప్పటికే ఉన్న జియో ఫైబర్‌, జియో ఎయిర్​ఫైబర్‌ వినియోగదారులు కూడా ఈ ప్లాన్‌కు మారవచ్చని జియో వెల్లడించింది.

ఫ్రీ ఫ్రీ ఫ్రీ
జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌తో 30 ఎంబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. నెట్​ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో సినిమా ప్రీమియం, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, ఈటీలీ విన్ వంటి 15 ఓటీటీ యాప్స్‌ లభిస్తాయి. ప్రస్తుత ఐపీఎల్‌ ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ కూడా ఈ ప్లాన్​కు వర్తిస్తుంది. దీని కింద అర్హత కలిగిన జియో ఫైబర్‌, జియో ఎయిర్​ఫైబర్‌ కస్టమర్లు 50 రోజుల డిస్కౌంట్ క్రెడిట్​ వోచర్​ను పొందవచ్చు.

రూ.29కే జియో సినిమా ప్రీమియం
వీడియో స్ట్రీమింగ్‌ రంగంపై పట్టు సాధించేందుకు జియో సినిమా సిద్ధమైంది. ఇటీవలే రూ.29, రూ.89లకు రెండు కొత్త ప్రీమియం సబ్​స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. నెలకు రూ.29 చెల్లిస్తే ఒక డివైజ్​లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా 4కే వీడియో క్వాలిటీతో కంటెంట్​ను వీక్షించొచ్చు. పైగా డౌన్​లోడ్‌ చేసుకొని ఆఫ్​లైన్​లోనూ కంటెంట్​ను చూడొచ్చు. సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్​బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ను స్మార్ట్‌ టీవీ సహా ఏ డివైజ్​లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. లైవ్‌ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్‌ మాత్రం యాడ్స్‌తో వస్తాయి.

BSNL Prepaid Plans :
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్‌ కాగా, మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్‌. వీటి ధరలు వరుసగా రూ.58, రూ.59. ఈ ప్లాన్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న రూ.58 ప్లాన్‌ ఒక డేటా వోచర్‌. దీన్ని పొందాలంటే కచ్చితంగా ఒక యాక్టివ్‌ బేస్‌ ప్లాన్‌ ఉండాలి. దీని వ్యాలిడిటీ 7 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. పూర్తి డేటా అయిపోయిన తర్వాత 40 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అలాగే రూ.59 ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా ఏడు రోజులే. SMS ప్రయోజనాలు ఉండవు. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్ సదుపాయం ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 2024 ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్​ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ప్రయోగాత్మక దశలో 700 - 2,100 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌విడ్త్​తో రూపొందించిన 4జీ నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబీపీఎస్‌ డేటా వేగాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Popular Bikes In India

వాట్సాప్ గ్రూపును రూ.6,400 కోట్ల కంపెనీగా మార్చిన యువకుడు - ఒక్క ఐడియాతో లైఫ్ ఛేంజ్​! - Dunzo Founder Kabeer Biswas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.