ETV Bharat / entertainment

Miss Shetty Mr Polishetty Movie: 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'లో బాలకృష్ణ.. ఆ సీన్స్​కు థియేటర్లో ఫ్యాన్స్​ రచ్చ రచ్చ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 4:22 PM IST

Updated : Sep 7, 2023, 5:55 PM IST

Miss Shetty Mr Polishetty Balakrishna : అనుష్క శెట్టి - నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన కొత్త చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. అయితే ఈ చిత్రంలో బాలయ్య ఉన్నారట. ఆ వివరాలు..

Miss Shetty Mr Polishetty: 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'లో బాలకృష్ణ!
Miss Shetty Mr Polishetty: 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'లో బాలకృష్ణ!

Miss Shetty Mr Polishetty Balakrishna : స్టార్ హీరోయిన్​ అనుష్క శెట్టి.. యంగ్​ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి'. మహేశ్‌బాబు దర్శకత్వం వహించారు. లవ్ అండ్​ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క - నవీన్‌ జంట, కామెడీ టైమింగ్‌, ఎమోషన్స్‌.. బాగున్నాట. సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాలోని పలు సీన్స్​లో నందమూరి నటసింహం బాలకృష్ణ కనిపించడం ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోందట. కానీ ఆయనేమీ గెస్ట్ రోల్ చేయలేదు. బాలకృష్ణ నటించిన పలు చిత్రాలను రిఫరెన్స్‌గా ఈ చిత్రంలో చూపించారు. అనుష్క తల్లి పాత్రలో నటించిన జయసుధ బాలయ్య అభిమానిగా కనిపిస్తారట.

ఇక అనుష్క - జయసుధలపై చిత్రీకరించిన ఓ సన్నివేశంలోనూ 'జై బాలయ్య.. జై జై బాలయ్య.. మన బాలయ్య, 'ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ బాలయ్య ఈజ్‌ ది బెస్ట్‌' అంటూ జయసుధ చెప్పే స్లోగన్స్‌ కూడా థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయట. ఓ సీన్​లో 'అఖండ' ఎంట్రీ సీన్స్‌ను చూపించడం కూడా హైలైట్​గా ఉందని అంటున్నారు. ఇక, ఈ సీన్స్‌ వచ్చినప్పుడు ప్రేక్షకులు 'జై బాలయ్య' అంటూ నినాదాలు చేస్తూ థియేటర్​ను హోరెత్తిస్తున్నారు.

Miss Shetty Mr Polishetty Review : సినిమా రివ్యూ విషయానికొస్తే.. కథా నేపథ్యం, నవీన్, అనుష్క నటన, వినోదం, భావోద్వేగాలు సినిమాకు ప్లస్​గా నిలిచాయి. ఆరంభ సన్నివేశాలు, నెమ్మదిగా సాగే కథనం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. శెట్టి - పొలిశెట్టి నవ్విస్తూ మదిని బరువెక్కించారు. సినిమాలో నవీన్‌ పొలిశెట్టి, అనుష్కతో పాటు జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు నటించారు. రధన్‌ సంగీతం అందించారు. గోపీసుందర్‌.. నేపథ్య సంగీతం, నీరవ్‌ షా.. ఛాయాగ్రహణం అందించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty Review : అనుష్క- నవీన్‌ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే ?

Last Updated :Sep 7, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.