ETV Bharat / entertainment

Miss Shetty MR Polishetty Box Office Collection : ఓవర్సీస్​లో కాసుల వర్షం​.. ఆ మార్క్​కు చేరువలో!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 12:27 PM IST

Miss Shetty MR Polishetty Box Office Collection : అనుష్క-నవీన్ పోలిశెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓవర్సీస్​ కలెక్షన్స్​ మంచిగా వస్తున్నాయి. ఆ వివరాలు..

Miss Shetty MR Polishetty Box Office Collection : ఓవర్సీస్​లో కాసుల వర్షం​.. ఆ మార్క్​కు చేరువలో
Miss Shetty MR Polishetty Box Office Collection : ఓవర్సీస్​లో కాసుల వర్షం​.. ఆ మార్క్​కు చేరువలో

Miss Shetty MR Polishetty Box Office Collection : సీనియర్ హీరోయిన్ అనుష్క దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. జాతి రత్నాలు ఫేమ్​ నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజై పాజిటివ్ టాక్‍ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదల ​రోజే షారుక్ ఖాన్​ జవాన్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల.. మంచి ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా మౌత్​ టాక్​తో హిట్ స్టేటస్​ అందుకుని​ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను అందుకుంటూ ముందుకెళ్తోంది.

కామెడీ ఎంటర్టైనర్ అండ్ సరోగసీ కాన్సెప్ట్​తో ఫన్నీగా వచ్చిన ఈ చిత్రం.. పదో రోజు కూడా మంచిగానే వసూలు చేసింది. వీకెండ్ కావడంతో సినిమాకు కాస్త కలిసొచ్చింది. మొత్తంగా ఈ చిత్రం పది రోజుల్లో ఇండియా వైడ్​గా రూ. 20.23 కోట్లు, రూ.34.75 కోట్లు అందుకుందట. ఓవర్సీస్​లో ఈ చిత్రం సక్సెస్​ ఫుల్​గా రన్ అవుతోంది. యూఎస్​ఏ బాక్సాఫీస్ ముందు ఇప్పటివరకు 1.5 మిలియన్ డాలర్స్(Miss Shetty MR Polishetty Overseas Collections) అందుకున్నట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫార్మ్ చేశారు. 2 మిలియన్ డాలర్స్‌ మార్క్​ను కూడా చేరుకుంటుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకోగా.. శాటిలైట్‌ రైట్స్‌ను జీ టీవీ సొంతం చేసుకుంది.

లాభాలు ఎంతంటే?.. ఈ చిత్రం వరల్డ్ వైడ్​గా రూ. 12.50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లు నమోదైంది. ఈ చిత్రం ఇప్పుడు పది రోజుల్లో రూ.20 కోట్ల వరకు అందుకుంది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ.6 కోట్ల వరకు లాభాలు అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాకు మహేశ్​ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Miss Shetty Mr Polishetty Review : అనుష్క- నవీన్‌ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే ?

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.