LIVE పొదిలి ప్రజాగళం సభలో చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 5:13 PM IST

Updated : May 3, 2024, 5:37 PM IST

thumbnail

Chandrababu Prajagalam Public Meeting in Podili Live: ప్రకాశం జిల్లా పొదిలి ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా అంతకుముందు ఆయన కడపలో భారీ రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం నెల్లూరులో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి వరాలు ఇచ్చిన జగన్, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చంద్రబాబు నిలదీశారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్ సొంత జిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ను అటకెక్కించారని కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాయలసీమలో మళ్లీ హత్యా రాజకీయాలకు తెరలేపారని చంద్రబాబు విమర్శించారు. హత్య కేసు నిందితులను పక్కన పెట్టుకుని జగన్‌ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాల స్థానంలో నవమోసాలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పొదిలి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 3, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.