ETV Bharat / technology

మీరు జియో సిమ్ వాడుతున్నారా? వెంటనే రీ-వెరిఫికేషన్ చేసుకోండిలా! లేకుంటే? - Jio Number Re verification

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:14 PM IST

Jio SIM Re-verification Process
Jio Number Re-verification

Jio Number Re-verification : మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే వెంటనే మీ జియో నంబర్​ను రీ-వెరిఫికేషన్ చేసుకోండి. గడువులోగా రీ-వెరిఫికేషన్ చేయకుంటే, మీ నంబర్ బ్లాక్ అయిపోతుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Jio Number Re-verification : మీరు ఇతరుల ఆధార్ కార్డ్ ఉపయోగించి జియో సిమ్ తీసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇతరుల ఐడెంటిటీ ప్రూఫ్​తో రిలయన్స్ జియో సిమ్ తీసుకుని వాడుతున్న వారందరూ కచ్చితంగా గడువులోగా రీ-వెరిఫికేషన్ చేసుకోవాలి. లేకుంటే మీరు వాడుతున్న సిమ్​ కార్డ్​ను బ్లాక్ చేసే అవకాశం ఉంది.

రిలయన్స్ జియో ఇప్పటికే తమ యూజర్లకు రీ-వెరిఫికేషన్ చేసుకోమని టెక్ట్స్ మెసేజ్​లు, కాల్స్ చేస్తోంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సందేశమే వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మీ నంబర్​ను రీ-వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఇది ఆప్షనల్ కాదు. గవర్నమెంట్​ గైడ్​లైన్స్ ప్రకారం ఇది తప్పనిసరి.

Jio Number Re-verification Process

  • ముందుగా మీరు My Jio యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • యాప్​లో మీ జియో నంబర్​తో లాగిన్ కావాలి.
  • అప్పుడు యాప్​లోని సర్వీస్​లు అన్నీ మీకు కనిపిస్తాయి.

(అక్కడ Re-verification pending! Please re-verify connection to avoid suspension of service అని కనిపిస్తుంది. ఇలా మీకు కూడా కనిపిస్తే, వెంటనే రీ-వెరిఫై చేసుకోవాలి.)

  • ఇందుకోసం మీరు Re-verify now బటన్​పై క్లిక్ చేయాలి.

(అక్కడ మీరు ఎందుకు మీ జియో నంబర్​ను రీ-వెరిఫై చేసుకోవాలో జియో వివరిస్తుంది. దీనిని చదివిన తరువాత మీ ఆధార్​ నంబర్​ను ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. లేదా ఓటర్​ ఐడీ, పాస్​పోర్ట్ లాంటి ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సైతం అప్లోడ్ చేయవచ్చు. )

  • మీరు కనుక ఆధార్​తో వెరిఫై చేసుకోవాలని అనుకుంటే, ఆధార్​కార్డ్​పై క్లిక్ చేసి, జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • తరువాత మీరు ఫోన్​ కెమెరాను ఓపెన్ చేసి, మీ ఫొటో తీసుకోవాలి. ఆ ఫొటో కచ్చితంగా చాలా క్లియర్​గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది మీ ఆధార్ కార్డ్​లో ఉన్న ఫొటోతో సరిపోలుతుంది.

(ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు వేరే ఫోటోను అప్లోడ్ చేయలేరు. కేవలం కెమెరా ద్వారా రియల్​టైమ్​లో ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది.)

  • తరువాత మీరు సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్​!
  • మీ జియో నంబర్​ రీ-వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. దీనికి ప్రూఫ్​గా మీకు ఒక ఎస్​ఎంఎస్ వస్తుంది. దానిలో టికెట్ ఐడీ ఉంటుంది.
  • మీ జియో నంబర్ రీ-వెరిఫికేషన్ పూర్తి కావడానికి సుమారుగా 7-8 గంటలు పడుతుంది. రీ-వెరిఫికేషన్ పూర్తైన తరువాత ఆ విషయం మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ - మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే! - New Bank Rules From May 1st 2024

త్వరలో అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్'​ - ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్! - Amazon Great Summer Sale 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.