ETV Bharat / sports

IPLలో 'సన్​రైజర్స్' కొత్త చరిత్ర- 17ఏళ్ల రికార్డ్ సెట్ చేసిన హైదరాబాద్ - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 3:28 PM IST

Updated : Apr 26, 2024, 5:09 PM IST

Sunrisers Hyderabad
Sunrisers Hyderabad

Sunrisers Hyderabad Sixes: సన్​రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్​లో మరో రికార్డు క్రియేట్ చేసింది. 17ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు అందుకోని ఫీట్ సాధించింది.

Sunrisers Hyderabad Sixes: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ మరో అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో సింగిల్ ఎడిషన్​లో అత్యధిక సిక్స్​లు బాదిన జట్టుగా రికార్డు సృష్టించింది. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ బ్యాటర్లంతా కలిసి 9 సిక్స్​లు బాదారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్​లో 100 సిక్స్​ల మార్క్​ టచ్ చేశారు. దీంతో ఐపీఎల్​లో ఓ సీజన్​లో 100+ సిక్స్​లు బాదిన తొలి జట్టుగా రికార్డు కొట్టింది. ప్రస్తుత సీజన్​లో సన్​రైజర్స్​ ఇప్పటివరకు 108 సిక్స్​లు బాదింది.

వాళ్లూ టాప్​లో: ఈ సీజన్​లో అత్యధిక సిక్స్​లు బాదిన లిస్ట్​లోనూ సన్​రైజర్స్ ప్లేయర్లే టాప్- 2లో ఉన్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడిన హెన్రీచ్ క్లాసెన్ 27 సిక్స్​లు బాదగా, అన్నే మ్యాచ్​లు ఆడిన ఓపెనర్ అభిషేక్ శర్మ 26 సిక్స్​లు కొట్టాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 సిక్స్​లతో టాప్- 10లో కొనసాగుతున్నాడు.

ఇక ఈ ఏడాది సన్​రైజర్స్​ అద్భుతంగా ఆడుతోంది. భీకరమైన బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుత సీజన్​లో ఒకటి రెండు కాదు మూడుసార్లు 260+ స్కోర్ నమోదు చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (287-3) బాదిన రికార్డూ కొట్టింది. అది కూడారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బాదడం విశేషం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (51 పరుగులు), రజత్ పాటిదార్ (50 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. కామెరూన్ గ్రీన్ చివర్లో (37 పరుగులు) రాణించడం వల్ల ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. అనంతరం ఛేదనలో సన్​రైజర్స్ తడబడింది. ట్రావిస్ హెడ్ (1), అభిషేక్ శర్మ (31), ఎయిడెన్ మార్​క్రమ్ (7), హెన్రీచ్ క్లాసెన్ (7), నితీశ్ రెడ్డి (13) విఫలమయ్యారు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31 పరుగులు) మెరుపులు మెరిపించినా అది సన్​రైజర్స్ విజయానికి సరిపోలేవు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది.

దీంతో ప్రస్తుత సీజన్​లో సన్​రైజర్స్ మూడో పరాజయాన్ని చవిచూడగా, ఆర్సీబీ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుత సీజన్​లో 8 మ్యాచ్​ల్లో 5 విజయాలతో సన్​రైజర్స్ పట్టికలో మూడో స్థానంలో ఉండగా, 9 మ్యాచ్​ల్లో 2 గెలుపులతో 10వ ప్లేస్​లో కొనసాగుతోంది.

సన్​రైజర్స్ ఓటమి - కోహ్లీ, పాటిదర్​ మెరుపులతో ఎట్టకేలకు ఆర్సీబీ రెండో విజయం - IPL 2024 SRH VS RCB

కోహ్లీ అరుదైన రికార్డ్​ - ఐపీఎల్​ చరిత్రలోనే ఏకైక క్రికెటర్​గా - IPL 2024 SRH VS RCB

Last Updated :Apr 26, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.