ETV Bharat / health

బరువు తగ్గాలని డిన్నర్​ స్కిప్​ చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి! - Skipping Dinner to Weight Loss

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 10:43 AM IST

Side Effects of Skipping Dinner: నేటి యువత ఫిట్​నెస్​పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మన ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి లేదా పలు రకాల కారణంగా బరువు పెరుగుతుంటారు. ఆ బరువును తగ్గించుకునేందుకు డైట్​, ఎక్సర్​సైజ్ అంటూ​ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసే వాటిలో కొన్ని మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం స్కిప్​ చేయడం ప్రమాదం అంటున్నారు. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం..

ARE YOU SKIPPING DINNER FOR WEIGHT LOSS
Side Effects of Skipping Dinner (ETV Bharat)

Side Effects of Skipping Dinner to Weight Loss: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది. దాని బారిన పడే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పలు సమస్యలే కారణం. అయితే ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు రాత్రి పూట భోజనం మానేస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు​ డిన్నర్​ స్కిప్​ చేస్తే ప్రమాదమని.. పలు రకాల సమస్యలు వేధిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి నైట్​ భోజనం తినకపోతే ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం..

రాత్రి భోజనం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పడుకునే ముందు శరీరానికి కావాల్సిన కీలకమైన కేలరీలు, పోషకాలను ఇది అందిస్తుందంటున్నారు. 24 గంటల్లో శరీరం ఎక్కువ సమయం తినకుండా నిద్రపోతుంది.. కాబట్టి రాత్రి తప్పకుండా భోజనం చేయాలని చెబుతున్నారు. రాత్రి భోజనం మానేస్తే చాలా తక్కువ రోజుల్లో బరువు తగ్గడం ఏమో కానీ.. దీర్ఘకాలికంగా మంచిది కాదంటున్నారు. ఈ అలవాటు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని.. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సైడ్​ ఎఫెక్ట్స్​ చూస్తే..

శక్తి లేకపోవడం: రాత్రి భోజనం మానేయడం వల్ల తెల్లారి ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అలసటగా అనిపించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శరీరం పనిచేయడానికి చేయడానికి శక్తి అవసరం. రాత్రి భోజనం మానేయడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయంటున్నారు.

కండరాలకు నష్టం: రాత్రి భోజనం మానేయడం కండరాల క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట శరీరం కండరాలను పునరుద్ధరిస్తుంది. అలాగే మరమ్మతు చేస్తుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఈ ప్రక్రియకు అవసరమైన శక్తి, పోషకాలు లభించవంటున్నారు.

పోషకాహార లోపం: రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరం చాలా ముఖ్యమైన పోషకాలను కోల్పోవచ్చని నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనంలో సాధారణంగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రి భోజనం మానేయడం వల్ల ఈ పోషకాలను పొందలేకపోతారు.

మీరు ఈ పొజిషన్​లోనే పడుకుంటున్నారా? లేకపోతే బోలెడు లాభాలు మిస్​ అయినట్లే! - Which Position is Good for Sleep

జీర్ణ సమస్యలు: డిన్నర్​ తినకపోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. 2018లో "న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రాత్రి భోజనం మానేసిన వ్యక్తులు.. రాత్రి భోజనం తినే వారి కంటే మలబద్ధకం లక్షణాలను అనుభవించే అవకాశం 42% ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటోంగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసే డాక్టర్ జి.యస్. యాంగ్ పాల్గొన్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు కారణమయ్యే హార్మోన్ల స్థాయిలలో మార్పులు రావచ్చని వారు పేర్కొన్నారు.

నిద్రలేమి: రాత్రి భోజనం మానేయడం వల్ల నిద్రపోవడంలో ఇబ్బంది కలగవచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల ఆకలిగా అనిపించి, నిద్రకు భంగం కలుగుతుందంటున్నారు.

జలుబు, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం: రాత్రి భోజనం స్కిప్​ చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లకు గురియ్యే అవకాశం పెరుగుతుందని అంటున్నారు.

మానసిక స్థితిలో మార్పులు: రాత్రి భోజనం మానేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చిరాకు, ఆందోళన, నిరాశ వంటి మానసిక స్థితిలో మార్పులు రావచ్చంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్‌ - మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతున్నారా? - ముప్పు తప్పదట! - Effects Of Afternoon Sleep

ఆడవాళ్లూ మల్లెపూలు పెట్టుకుంటున్నారా? - అయితే మీకో షాకింగ్​ న్యూస్​! - Wearing Jasmine Side Effects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.