ETV Bharat / state

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

author img

By

Published : Nov 3, 2019, 10:24 AM IST

సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా పాటలు, నృత్యాల పోటీలు జరుపటం చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా జోగులాంబ గద్వాల జిల్లా పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం శునకాల పరుగు పోటీలను నిర్వహించారు. బహుమతులూ ఇచ్చారు.

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం పాగుంటలో స్వయంభు శ్రీవెంకటేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా వినూత్న పోటీలు నిర్వహించారు. ఎద్దులతో బండలాగుడు, శునకాల పరుగు పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు బహుమతులు ఇచ్చారు.

జిల్లా నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి వివిధ జాతులకు చెందిన 22 శునకాలను వాటి యజమానులు పోటీలకు తీసుకువచ్చారు. శునక పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

Intro:tg_mbnr_11_02_DOG_RACE__avb_Ts10049
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుఖాలతో వినుత మైన రీతిలో పరుగుపందెం నిర్వహించిన పాగుంట గ్రామస్తులు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం పాగుంట గ్రామం లో వెలిసిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న జాతర ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు నిర్వహించారు. మొదటగా వృషభ రాజులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృషభ రాజు లు పోటీలో పాల్గొన్నాయి . వీటితోపాటు వినుత మైన శునకాల క్రీడలను క్రీడా పోటీలు నిర్వహించారు. శునకాల పరుగుపందెంలో మొదటి బహుమతి ఇ 20 వేల రూపాయలు రెండవ బహుమతి 15 వేల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు గెలిచిన సుఖాలకు బహుమతులను అందజేస్తారు. ఈ క్రీడలకు సంబంధించి 22 సుఖాలు పోటీలో పాల్గొనగా dipu ద్వారా 11 సుఖాలకు పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 11 రౌండ్లు ఉండగా మూడు రౌండ్లు నిర్వహించారు. సుఖాలు కర్ణాటక మహారాష్ట్ర గుల్బర్గా నుంచి శునకాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. శునకాల పోటీని తిలకించేందుకు వచ్చిన వివిధ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో పోటీ నిర్వహించే నిర్వాహకులకు తీవ్ర ఇబ్బంది. శునకాల పోటీ నీకి లెక్కించేందుకు వచ్చిన ప్రేక్షకులకు 3 రౌండ్లోనే శునకాల పోటీని నిలిపివేశారు. తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ నిలవడంతో అక్కడినుంచి నిరాశా నిస్పృహలతో ప్రేక్షకులు వెనుదిరిగారు.
byte:
1. శ్రీనివాసులు చిన్న పాడు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా
2. రాథోడ్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ కర్ణాటక రాష్ట్రం


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.