ETV Bharat / state

GHMC Ward Offices : వార్డు కార్యాలయాలు.. ప్రజల చెంతకే సేవలు

author img

By

Published : Jul 14, 2023, 8:52 PM IST

GHMC Ward Offices
GHMC Ward Offices

Wards Governance in GHMC : గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జనాలకు జవాబుదారీగా ఉండాలి. సేవల లోపంతో ప్రజలు నష్టపోకుండా చూడాలి. ఇలాంటి ఆలోచనలతో వార్డు కార్యాలయాలను ప్రారంభించింది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌. నగరవాసులకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా 2,3 రోజుల్లో పరిష్కరించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. లక్ష్యం దిశగా ముందుకెళ్తున్న జీహెచ్ఎంసీకి కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కొరత, వసతుల లేమితో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయాల సమాచారం తెలియక కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది దురుసు ప్రవర్తన కూడా నగరవాసులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. మొత్తంగా వార్డు కార్యాలయాల సేవలు, ఫిర్యాదుల పరిష్కారం ఎలా జరుగుంది? ప్రజలేమంటున్నారు.? లాంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

వార్డు కార్యాలయాలు.. ప్రజల చెంతకే సేవలు

Ward Office System in GHMC : హైదరాబాద్‌ ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలనే లక్ష్యంతో.. వార్డు కార్యాలయాలకు శ్రీకారం చుట్టింది జీహెచ్‌ఎంసీ. నగరంలోని 150 వార్డు కార్యాలయాలకు గాను 132 కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. మరో 18 కార్యాలయాలను త్వరలో అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు ఇంతకుముందు వరకు ఏదైనా సమస్యకు సంబంధించిన ఫిర్యాదును విద్యుత్‌, జలమండలి, ఇలా ఆయా కార్యాలయాలకు వెళ్లి ఇచ్చేవారు.

GHMC Ward Offices : కాగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వార్డు కార్యాలయాల్లో.. నగర వాసులు ఎలాంటి సమస్యనైనా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా కార్యాలయ సిబ్బంది చర్యలు తీసుకుంటుంది. ఇలా ప్రజాసమస్యల పరిష్కారమే ధ్వేయంగా ముందుకుకెళ్లిన జీహెచ్‌ఎంసీ ఆ దిశగా అడుగులేసి ప్రజలకు మరింత దగ్గరవుతుంది. ఇందుకోసం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డు కార్యాలయానికి ఇంఛార్జీగా ఉండగా.. మొత్తం 10 మంది శాఖలకు చెందిన అధికారులు ఉంటారు.

రోడ్లు, డ్రైనేజీ, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ విభాగం, కమ్యూనిటీ ఆఫీసర్, వార్డ్ శానిటరి జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, జలమండలి వార్డ్ అసిస్టెంట్, విద్యుత్‌శాఖ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ తదితర విభాగాల అధికారులు ఈ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వార్డు అధికారుల జాబ్ చార్టుతో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంత కాలంలో పరిష్కరిస్తామో.. చెప్పే సిటిజన్ చార్ట్‌ను ఏర్పాటు చేశారు.

Rajasingh Comments on ward offices : 'వార్డు ఆఫీసులతో ప్రజల పనులు అవుతాయన్న నమ్మకం లేదు'

సిటిజన్‌ చార్టర్‌లో సూచించిన విధంగా ఫిర్యాదుల్ని పరిష్కరించడం కోసం.. వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 10 విభాగాలకు చెందిన అధికారులు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి తమకు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదుల పురోగతిని రోజువారీగా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నారు. వార్డు కార్యాలయాలకు అందే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం వీధి దీపాలు, విద్యుత్‌ సమస్యలు , విద్యుత్‌ సమస్యలు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ఎంటమాలజీ, వీధికుక్కల బెడద లాంటివి ఎక్కువగా వస్తున్నాయి.

Ward Office System in GHMC : గతంలో కంటే ఇప్పుడు ఫిర్యాదులు వెంటనే పరిష్కారం అవుతున్నాయని.. అన్ని కార్యాలయాలు తిరిగే బాధలు తప్పుతున్నాయని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్‌లోని వార్డు పరిధిలో అత్యధిక జనాభా ఉంటుంది. కానీ, ఆ జనాభాకు అనుగుణంగా వార్డు కార్యాలయాలు అందుబాటులో లేవనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవి ఎక్కడ ఉన్నాయో స్థానికులకే తెలియని పరిస్థితి. దీనికి తోడు మరిన్ని కార్యాలయాల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి లాంటివి సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారాయి. దీనికి తోడు కొందరు అధికారులు ఉదయం ఫీల్డ్‌లో ఉన్నా సాయంత్రం 3 నుంచి 5గంటల వరకు ఉండాలనే నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు.

మరోవైపు కొన్ని కార్యాలయాల్లో సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలతో సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. నేరుగా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల కంటే ఆన్‌లైన్‌ ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. గత నెల 16న ప్రారంభమైన అన్ని వార్డుల నుంచి 45,000 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో నేరుగా కార్యాలయాలకు అందన ఫిర్యాదులు కేవలం 1902 కాగా.. 339 ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

Wards Governance in GHMC : కానీ జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌, యాప్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో అందిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదని నగర వాసులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిష్కరిస్తే జీహెచ్‌ఎంసీ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

"వార్డు కార్యాలయాలు పెట్టాక మాకు కూడా సులువుగా మారింది. ఇప్పుడు దరఖాస్తు ఎవరూ చేస్తున్నారో తెలుస్తోంది. వీధిదీపాలు, రోడ్ల మరమ్మతులు వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఒకటి, రెండు రోజుల్లోనే పరిష్కరిస్తున్నాం." - సబిత, వార్డు ఇంజినీర్, హిమాయత్‌నగర్

"మురుగు సమస్యపై ఫిర్యాదు చేశాం. ఇప్పుడు మాకు ఫిర్యాదు చేయడానికి సులువుగా మారింది. ఇప్పుడు సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయి." - పూజా జైస్వాల్, హిమాయత్‌నగర్

ఇవీ చదవండి: Ward Office System in GHMC : జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.