ETV Bharat / entertainment

మంచు మనోజ్​ సినిమాలో మెగా డాటర్- బర్త్​ డే సర్​ప్రైజ్​గా నిహారిక ఫస్ట్​ లుక్ ఔట్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 6:13 PM IST

Niharika Movie What The Fish : మంచు మనోజ్​ నటిస్తున్న 'వాట్​ ది ఫిష్​' చిత్రంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటింస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా నిహారిక ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు.

Niharika New movie what the fish
Niharika New movie what the fish

Niharika Movie What The Fish : మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి వెండితెరపై మెరవనుంది. టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్​ నటిస్తున్న 'వాట్ ది ఫిష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు వరుణ్​ కోరుకండ తెరకెక్కిస్తున్నారు. విశాల్​ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్​ కార్తీక్​ సంగీతం అందిస్తున్నారు. ఇక నిహారిక పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్​ పోస్టర్​ను విడుదల చేసింది మూవీ టీమ్.

కొన్ని నెలల క్రితమే ఈ సినిమా టైటిల్​ (వాట్​ ది ఫిష్) ను ప్రకటించింది మూవీయూనిట్. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరో అని తెలుపుతూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. తర్వాత హాస్య నటుడు వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాట్లు తెలిపింది చిత్రబృందం. ఇప్పుడు నిహారిక బర్త్​ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. ఈ పోస్టర్​లో నిహారిక వైట్ షార్ట్​ డ్రెస్​లో మెరిసిపోతూ కనిపిస్తోంది. అలానే నిహారిక వెనకాల డాలర్​ గుర్తును పెట్టారు. దీంతో ఈ మూవీలో నిహారిక అష్టలక్ష్మీ క్యారెక్టర్​లో కనిపించన్నట్లు అర్థం అవుతోంది. అయితే నిహారిక ఈ సినిమాలో హీరోయిన్​గా లేదా ఏదైనా కీలక పాత్రలో నటిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

మెగా డాటర్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక. కేరీర్​ ప్రారంభంలో ఈ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్​ షో 'ఢీ జూనియర్స్​'లో యాంకర్​గా వ్యవహరించి సత్తా చాటుకుంది. అలానే యూట్యూబ్​లో పలు వెబ్​ సిరీస్​లు చేసింది. ఆ తర్వాత నాగశౌర్యకు జోడిగా 'ఒక మనసు' చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు ఆపలేదు నిహారిక. నటనపై ఉన్న ఇష్టంతో ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది. ఇటు హీరోయిన్​గా చేస్తూనే, నిర్మాతగా మారింది నిహారిక. ఇటీవల ఓ ప్రొడక్షన్​ హౌస్​ను కూడా ప్రారంభించింది.

లావణ్య​తో వరుణ్ తేజ్​ మ్యారేజ్.. మెగా డాటర్​ రియాక్షన్ ఇదే!

Niharika Latest Pics : సూపర్​ హాట్​గా మెగా డాటర్​ లేటెస్ట్​ ఫొటోషూట్​​​.. ఆ అందాలన్నీ చూపిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.