ETV Bharat / entertainment

అదిరిన 'మనోజ్​- మౌనిక' మెహందీ వీడియో.. గెస్ట్​లకు 'ఓడ్కా పానీ పూరీ'!

author img

By

Published : Mar 5, 2023, 5:15 PM IST

నూతన దంపతులు మంచు మనోజ్‌-మౌనికా రెడ్డి మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి యూట్యూబ్‌లో పెట్టారు. అందులో పానీపూరి విత్‌ ఓడ్కా చాలా స్పెషల్‌!.. ఆ సంగతులేంటో చూద్దాం రండి.

manchu-manoj-mehandi-event-on-manchu-laxmi-youtube-channel
manchu-manoj-mehandi-event-on-manchu-laxmi-youtube-channel

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్​, భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి హైదరాబాద్​ ఫిల్మింనగర్‌లోని మనోజ్‌ అక్క అయిన మంచు లక్ష్మి ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుక అంతా ఆమె చేతుల మీదుగానే జరిగింది. చాలా కాలంగా మనోజ్‌-మౌనికా రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. ఈ జంట శుక్రవారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది.

పెళ్లి తర్వాత మనోజ్‌-మౌనిక జంట ఆదివారం ఆళ్లగడ్డకు కూడా వెళ్లారు. ఆ సమయంలో మంచు మనోజ్​ మౌనికల కాన్వాయ్​కు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో ఫుల్​ వైరల్​గా మారింది. రాయలసీమ రామన్న చౌదరి అంటూ మంచు అభిమానులు నెట్టింట కామెంట్లు పెట్టారు. అయితే.. పెళ్లి వేడుక కంటే ముందు జరిగిన మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు.

వీడియో మెహందీ వేడుకలో ఏర్పాట్ల గురించి చెప్పిన లక్ష్మి, అతిథుల కోసం ఏర్పాటు చేసిన వంటకాలు రుచి చూసి మరీ రివ్యూ ఇచ్చారు. తన ఇంట్లో మామిడి చెట్టుకు ఉన్న మామిడి కాయలు ఒక్కడి కిందపడ్డా.. తలకాయలు లేపేస్తానని ఏర్పాట్లు చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చి మరీ.. పనులు చేయిస్తున్నట్లు లక్ష్మి పేర్కొన్నారు. అయితే.. మెహందీ వేడుకలకు వచ్చే అతిథులకు చాట్‌ ఏర్పాటు చేశారు.

మెహందీ తిని చపాతీలు లాంటివి తినడం కష్టం అవుతుందని వివిధ రకాల చాట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజస్థాన్‌ స్పెషల్‌ చాట్‌తో పాటు పలు రకాల పానీపూరీలను ఏర్పాటు చేశారు. అందులో కొన్నింటిని ఆమె రుచి చూశారు. అయితే.. ఎవరీ తెలియకుండా పానీపూరీలో ఓడ్కా కలుపుతానని మంచు లక్ష్మి సరదాగా అన్నారు. అయితే.. విందు మొదలైన తర్వాత నిజంగానే కలిపారా? లేదా? అనేది మాత్రం తెలియదు!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు.. దటీజ్‌ మనోజ్‌: వెన్నెల కిశోర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.