ETV Bharat / bharat

'వీరసైనికుల త్యాగాలనే అవమానిస్తారా?'

author img

By

Published : Feb 21, 2021, 7:39 PM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు. భారత సైనికుల ధైర్య సాహసాలపై అనుమానం వ్యక్తం చేసిందని కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్​నాథ్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Nobody can capture an inch of the country's land, asserts  Defence Minister Rajnath Singh in Salem
'పురుచ్చీ తలైవీని మరచిపోం'

తూర్పు లద్దాఖ్​లో భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటించారు. భారత సైనికుల ధైర్య సాహసాలపై కాంగ్రెస్​ అనుమానం వ్యక్తం చేసిందని ఆరోపించిన రాజ్​నాథ్​.. చైనాతో 9 విడతల సుదీర్ఘ చర్చల అనంతరం ఇది సాధ్యమైందని తెలిపారు.

సరిహద్దులపై తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను దేశం ఎప్పటికీ అనుమతించదని.. అలాంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు రాజ్​నాథ్​ ఉద్ఘాటించారు. తమిళనాడులో నిర్వహించిన భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) సమావేశంలో ఆయన​ పాల్గొన్నారు.

''9 విడతల దౌత్య, ఉన్నత స్థాయి సైనిక చర్చల అనంతరం ఇది సాధ్యమైంది. కానీ దురదృష్టవశాత్తు భారత సైనికుల ధైర్యాన్ని కాంగ్రెస్ అనుమానిస్తోంది. అత్యున్నత త్యాగం చేసే సైనికులను అవమానించడం తగదు.''

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి​

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాజ్​నాథ్​.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను భాజపా ఎప్పటికీ మరచిపోదని తెలిపారు. కేంద్రంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వానికి ఆమె సహృదయంతో మద్దతు తెలిపారని గుర్తుచేశారు. జయలలితను తమిళనాడు ముద్దుబిడ్డ, పురుచ్చి తలైవీ అంటూ తన ప్రసంగంలో రాజ్​నాథ్​ ఉటంకించారు.

కరోనా సంక్షోభం అనంతరం తిరిగి ప్రారంభమైన ఆర్థిక ప్రగతి.. దేశవృద్ధికి సంకేతమని ప్రకటించారు.

''భారతదేశాన్ని మరింత వృద్ధిపథంలో నూతన శకాన్ని ఆవిష్కరించబోతున్నాం. ప్రగతిపథంలో నడపడానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు జల్లికట్టు మాదిరే మంచి లాభాల్లో ఉన్నాయి.''

-రాజ్​నాథ్​ సింగ్​

అది గౌరవం కాదా?..

అటల్ బిహారీ వాజ్‌పేయీ.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేశారు. అది తమిళనాడుకు గౌరవం కాదా? అని రాజ్​నాథ్​ ప్రశ్నించారు. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పజెప్పిందని రాజ్​నాథ్​ ఆరోపించారు. అయితే ఆ నిర్ణయాన్ని వాజ్‌పేయీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఆ ద్వీపాన్ని వదులుకునే నిర్ణయాన్ని ఖండించారని తెలిపారు.

ఇదీ చదవండి: పెట్రో ధరలు తగ్గించాలని మోదీకి సోనియా లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.