LIVE : కాకినాడలో జనసేనాని పర్యటన- ఎన్నికల ప్రచారం ప్రత్యక్ష ప్రసారం - Pavan Election campaign At Kakinada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 7:00 PM IST

Updated : Apr 27, 2024, 7:35 PM IST

thumbnail

Pavan Kalyan Varahi Vijaya Bheri Sabha At Kakinada Live :  నేడు కాకినాడ జిల్లా పెద్దాపురం, గ్రామీణంలో పవన్‌ పర్యటిస్తున్నారు. రేపు ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేనాని పవన్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ దోపిడిపై విచారణ చేపడతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాయి దాడి విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్​ను భయపెట్టే విధంగా భారీ మెజారిటీని ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రస్తుతం పెద్దాపురం వారాహి విజయ భేరీ సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్, ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 27, 2024, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.